ఐపిఓకి మరో కంపెనీ.. ప్రైస్ బ్యాండ్ రూ.100 లోపే.. ఇన్వెస్టర్లు బెట్ వేసేందుకు రెడీ..
మీరు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా అయితే మీకో గుడ్ న్యూస్. వచ్చే వారం మరో కంపెనీ ఐపీఓ పెట్టుబడులకు తెరలేపుతోంది. ఈ IPO ఎమరాల్డ్ టైర్ తయారీ కంపెనీది. కంపెనీ ఇష్యూ డిసెంబర్ 5న ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఓపెన్ అవుతుంది. ఇన్వెస్టర్లు డిసెంబర్ 9 వరకు ఈ ఇష్యూలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎమరాల్డ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ IPO ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.90 నుండి రూ.95.
ఇతర వివరాలు ఏంటి
ఎమరాల్డ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ IPO అనేది బుక్ బిల్ట్ ఇష్యూ. IPO ద్వారా సుమారు రూ.49.26 కోట్లు సేకరించాలనేది కంపెనీ లక్ష్యం. ఇందులో రూ.47.37 కోట్ల ఫ్రెష్ ఇష్యూ, రిటైల్ కోటా 35%, QIB 50%, HNI 15%. ఎమరాల్డ్ టైర్ కంపెనీ IPO 12 డిసెంబర్ 2024న NSEలో లిస్ట్ కానుండగా ఎమరాల్డ్ టైర్ మాన్యుఫ్యాక్చరర్స్ IPO కేటాయింపు తేదీ 10 డిసెంబర్ 2024. ఈ సంస్థ ప్రమోటర్ చంద్రశేఖరన్ త్రిరుపతి వెంకటాచలం. కంపెనీ షేర్లు ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో లేవని గమనించాలి.

ఎమరాల్డ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ లిమిటెడ్ వివిధ రకాల టైర్ల ఉత్పత్తి, సప్లయ్ ఇంకా సర్వీసెస్ వ్యాపారం కోసం 2002లో స్థాపించారు. కంపెనీ ఆఫ్-హైవే టైర్ అండ్ వీల్ సర్వీసెస్ ద్వారా ఫుల్ సోల్యుషన్స్ అందిస్తుంది. 2023లో రూ.167.98 కోట్లతో పోలిస్తే 2024లో రూ.171.97 కోట్ల రెవెన్యూని కంపెనీ నివేదించింది. కంపెనీ 2023లో రూ.8.93 కోట్ల లాభంతో చూస్తే 2024లో రూ.12.24 కోట్ల లాభాన్ని ప్రకటించింది.
తాజాగా గణేష్ ఇన్‌ఫ్రావరల్డ్ IPO ఓపెన్ అయ్యింది. ఈ SME సెగ్మెంట్ IPOలో డిసెంబర్ 3వరకు పెట్టుబడిదారులు బెట్ వేయవచ్చు. కంపెనీ ఐపీఓ పరిమాణం రూ.98.58 కోట్లు. ఇప్పటివరకు గ్రే మార్కెట్‌లో కూడా కంపెనీ మంచి పర్ఫార్మెన్స్ కనబరిచింది. IPO ద్వారా కంపెనీ 118.77 లక్షల షేర్లను జారీ చేసింది.
గణేష్ ఇన్‌ఫ్రావరల్డ్ IPO ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.78 నుంచి రూ.83గా నిర్ణయించింది. కంపెనీ తరపున బెట్టింగ్‌లు వేసిన ఇన్వెస్టర్లకు డిసెంబర్ 4న షేర్లను కేటాయిస్తారు. కంపెనీ లిస్టింగ్ డిసెంబర్ 6న NSEలో ప్రతిపాదించిందింది. గణేష్ ఇన్‌ఫ్రావరల్డ్ IPO లాట్ సైజు 1600 షేర్లు. దీని కారణంగా పెట్టుబడిదారులు కనీసం రూ. 1,32,800 బెట్ వేయాలి.


Click it and Unblock the Notifications