మీరు ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే EPF లేదా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనే పదాన్ని వైన్ ఉంటారు ? అవును, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగుల UAN యాక్టివేషన్ అండ్ ఆధార్ లింక్ కోసం గడువును 15 ఫిబ్రవరి 2025 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ గడువును ఇప్పటికే అనేకసార్లు పొడిగించారు కూడా.
మీ జీతం నుండి ఎంప్లయ్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) కోసం కట్ చేస్తే మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేసుకోవడం అవసరం. UAN యాక్టివేషన్ ద్వారా మీరు PF బ్యాలెన్స్‌లను చెక్ చేయవచ్చు ఇంకా డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు, నామినీ పేరును కూడా చేర్చవచ్చు అంతేకాదు ఇతర ఉపయోగకరమైన పనులు కూడా చేయవచ్చు. సమాచారం ద్వారా మీరు మీ UAN నంబర్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఫిబ్రవరి 6 నాటి సర్క్యులర్ ప్రకారం ఫిబ్రవరి 15 వరకు పొడిగించడానికి ముందు జనవరి 15 గడువును నిర్ణయించారు. ఈ గడువు ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం ప్రయోజనాలను పొందేందుకు అర్హత ఉన్న ఉద్యోగులకు వర్తిస్తుంది. ఆధార్‌తో అనుసంధానిస్తే ఈ పథకం ప్రయోజనాలు బ్యాంకు అకౌంట్ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా పంపిణీ చేయబడతాయి. ప్రస్తుతం ఆధార్‌ను బ్యాంకు అకౌంట్ లింక్ చేయడానికి గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. భారత ప్రభుత్వం 2024లో మొదటిసారి ఉద్యోగార్థుల కోసం ఉపాధి సంబంధిత ప్రోత్సాహక (ELI) పథకాలను అమలు చేసింది. మొదటిసారి ఉద్యోగార్థులకు EPFO రిజిస్ట్రేషన్ అండ్ UAN యాక్టివేషన్ తప్పనిసరి.
దీనికి సంబంధించి మొదటి సర్క్యులర్ గత ఏడాది నవంబర్ 22న జారీ చేసింది, ఆ సమయంలో EPFO నవంబర్ 30 వరకు గడువు విధించింది. నవంబర్ 22 నాటి సర్క్యులర్‌లో అర్హులైన ఉద్యోగులందరూ 2024-25 బడ్జెట్‌లో ప్రకటించిన ఉపాధి సంబంధిత ప్రోత్సాహక పథకం ప్రయోజనాన్ని పొందేలా చూసుకోవడానికి, UANని యాక్టీవెట్ చేయడం ఇంకా ప్రతి ఉద్యోగి బ్యాంకు అకౌంట్ ఆధార్‌ను లింకింగ్ చేయడం తప్పనిసరి అని పేర్కొంది.
ఏం చేయాలి?
ప్రతి EPFO సబ్‌స్క్రైబర్ తప్పనిసరిగా ఆధార్‌ను UANతో లింక్ చేయాలి. సింగిల్ విండో ద్వారా వివిధ ప్రయోజనాలను పొందడానికి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా దీన్ని యాక్టివేట్ చేయాలి. ఫస్ట్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ కింద సబ్సిడీ పొందడానికి EPFO రిజిస్ట్రేషన్ అండ్ UAN యాక్టివేషన్ తప్పనిసరి.
EPFO పోర్టల్‌లో EPF UAN ని ఆధార్‌తో లింక్ చేయలంటే :
*EPFO మెంబర్ ఈ-సర్వీసెస్ వెబ్‌సైట్‌ని సందర్శించి, మీ UAN అండ్ పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
*మెనూలో 'KYC' అప్షన్ పై క్లిక్ చేయండి. KYC పేజీలో ఆధార్ కోసం చెక్‌బాక్స్‌ను సెలెక్ట్ చేసుకోండి.
*ఆధార్ ప్రకారం మీ 12 అంకెల ఆధార్ నంబర్ అండ్ పేరును ఎంటర్ చేయండి.
*ధృవీకరణ కోసం వివరాలను సబ్మిట్ చేయడానికి 'సేవ్' పై క్లిక్ చేయండి.
*విజయవంతంగా వెరిఫై తర్వాత, ఆధార్ మీ EPF అకౌంట్ లింక్ చేయబడుతుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications