Banking News: ఆ కాలంలో బ్రిటీష్ వారు దేశ సంపదను కొల్లగొట్టారు. పేరు వేరైనా ఇప్పుడు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారు దాదాపు అదే పని చేశారు. అందినకాడికి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎంచక్కా విదేశాలు చెక్కేశారు. ఇప్పటికీ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో రోజూ చూస్తూ కూడా మనం ఏమీ చేయలేకపోవడం శోచనీయం.
కాగా విజయ్ మాల్యా కేసుకు సంబంధించి ముంబైకి చెందిన CBI ప్రత్యేక కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్(NBW) జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) కి 180 కోట్ల రుణం ఎగవేసి పరారీలో ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. CBI సమర్పించిన వివరాలు, మాల్యా పరారీని పరిగణలోనికి తీసుకుని ఓపెన్-ఎండెడ్ NBW రిలీజ్‌కి తగిన కేసుగా న్యాయమూర్తి ఎస్పీ నాయక్ నింబాల్కర్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం అటకెక్కిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ చెల్లింపులపై కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా డీఫాల్ట్ చేయడం ద్వారా బ్యాంకుకు 180 కోట్లకు పైగా నష్టం కలిగించారని CBI ఆరోపించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు చేసిన మనీలాండరింగ్ కేసులో కూడా పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా మాల్యాను ప్రకటించింది. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తుండగా, ఆయనను తరిగి అప్పగించాలని భారత ప్రభుత్వం కోరుతోంది.
2007-2012 మధ్య IOB నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పొందిన రుణాలను దారి మళ్లించారని CBI ఆరోపిస్తోంది. ఈ చీటింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే వారెంట్ జారీ చేసింది. ఇతర కేసుల్లోనూ మాల్యాపై NBWలు ఉండటంతో సమన్లు జారీ చేసినా ప్రయోజనం ఉండదని కోర్టు భావించింది. మనీలాండరింగ్‌తో పాటు ఆరోపణలు కూడా ఉండటంతో PMLA కింద ప్రత్యేక న్యాయస్థానం కూడా విచారణ జరిపింది.


Click it and Unblock the Notifications