Dairy Milk: పిల్లలు మొదలు పెద్దల వరకు చాక్లెట్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. 'తియ్యని వేడుక చేసుకుందాం' అంటూ భారతీయుల మదిని తాకిన చాక్లెట్ బ్రాండ్ క్యాడ్‌బరీ డైరీ మిల్క్. కానీ ఇటీవల ఆ ఉత్పత్తిపై ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆహార భద్రత విభాగం సైతం రంగంలోకి దిగి, పరీక్షలు నిర్వహించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆ బ్రాండ్ ప్రతిష్ఠకు డ్యామేజ్ ఏర్పడింది.
ఇది జరిగి సరిగ్గా మూడు నెలలు కాకముందే మరోసారి డైరీ మిల్క్ చాక్లెట్ పై సోషల్ మీడియాలో ఫిర్యాదు దర్శనమిచ్చింది. అయితే ఈసారి చాక్లెట్ కుళ్లిపోయిందంటూ ఓ నెటిజన్ ఫొటోలు షేర్ చేశారు. గతంలో ఘటన చోటుచేసుకున్న హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లోనే మరోసారి ఇలా జరగడంతో సదరు సంస్థపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'హైదరాబాదీ పిల్లా' అనే ఖాతా ద్వారా ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. అమీర్ పేట మెట్రోస్టేషన్ లో డైరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేసి, తీరా తిందామని ఓపెన్ చేసే సమయానికి అందులో బూజు కనిపించినట్లు నెటిజన్ చెప్పుకొచ్చారు. చాక్లెట్ తయారీ తేదీ జనవరి 2024 కాగా 12 నెలల వరకు ఎక్స్‌పైరీ డేట్ ఉందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ కావడంతో పలువురు సామాజిక మాధ్యమ యూజర్లు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మెట్రో స్టేషన్‌లో షాపుతో పాటు క్యాడ్‌బరీ సంస్థపై విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఈ ఘటనపై ఫుడ్ సెఫ్టీ అధికారులు స్పందించాల్సి ఉంది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications