Binny Bansal: దేశీయ ఇ-కామర్స్ రంగంలో పలు సంస్కరణలకు ఫ్లిప్‌కార్ట్ నాంది పలికింది. దీంతో నంబర్ 1 ప్లేయర్‌గా కొనసాగుతోంది. అయితే ఎన్నో కలలతో కంపెనీని మొదలుపెట్టిన వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సాల్.. సంస్థ నుంచి ఇటీవల నిష్క్రమించారు. కాగా ఇప్పుడు కంపెనీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకులు బిన్నీ బన్సాల్ కూడా ఇటీవలే ప్లిప్‌కార్ట్‌లో తన మిగిలిన వాటాను విక్రయించారు.అనంతరం తాజాగా బోర్డు నుంచి అధికారికంగా రాజీనామా చేసినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఫిన్‌టెక్ 'నవీ'ని కొనసాగించేందుకు కొన్నేళ్ల క్రితం సహ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్ ఫ్లిప్‌కార్ట్ నుంచి వైదొలిగారు. అయితే మరోసారి ఇ-కామర్స్ రంగంలోకి ప్రవేశించాలనే బిన్నీ బన్సాల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

గత 16 ఏళ్లుగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సాధించిన విజయాలపై బిన్నీ హర్షం వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వ బృందంతో కలిసి కంపెనీని బలమైన స్థానంలో నిలబెట్టినట్లు ధృవీకరించారు. 'కంపెనీ సమర్థుల చేతుల్లో ఉందని తెలుసు. నేను పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కస్టమర్స్ అనుభవాలను మెరుగుపరచడంతోపాటు వ్యాపారానికి బలమైన మద్దతుదారునిగా కొనసాగుతాను. జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను' అని పేర్కొన్నారు.
బిన్నీ విశిష్ఠ సహకారానికి వాల్మెక్స్ ప్రాంతీయ CEO లీ హాప్‌కిన్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ CEO మరియు బోర్డ్ మెంబర్ కళ్యాణ్ కృష్ణమూర్తి కూడా ఆయన భాగస్వామ్యానికి ప్రశంసలు తెలియజేశారు. బోర్డులో అతను తీసుకువచ్చిన అమూల్యమైన మార్పులను మరియు నైపుణ్యాభివృద్ధిని ప్రశంసించారు. దేశంలో షాపింగ్ అనుభవాన్ని మార్చడానికి కట్టుబడి ఉన్న గొప్ప అంకితభావంతో కూడిన టీమ్‌వర్క్ ఫలితంగా ఫ్లిప్‌కార్ట్ ఇవాళ ఈ స్థాయిలో ఉందన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications