రైతులకు ఎపి సర్కర్ గుడ్ న్యూస్.. సంక్రాంతి తరువాత 20వేలు ఖాతాలోకి..
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన చేసింది. రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదికి ఇచ్చే రూ.6వేలతో కలిపి అన్నదాత సుఖీభవ పథం కింద ఇప్పుడు మొత్తం రూ.20వేలు అందజేయనున్నారు. అయితే గత ప్రభుత్వంలో రూ.13500 అందజేశారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తూ రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి సంక్రాంతి తరువాత అన్నదాత సుఖీభవకి శ్రీకారం చుట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 నెలలు కావోస్తుండగా ఇచ్చిన హామీల అమలు దిశగా ముందుకు వెళ్తుంది. గత ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా పేరుతో ఉన్న పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్పు చేసింది ఏపి కూటమి ప్రభుత్వం. ఈ పథకం ముఖ్య ఉదేశ్యం ఎపి రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఇంకా రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, పంటల అమ్మకాలు సులభతరం చేయడం. దీని ద్వారా రైతులకు పెట్టుబడికి కావలసిన మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా అర్హులైన రైతు బ్యాంక్ అకౌంట్లో వెస్తుంది.
అన్నదాత సుఖీభవ స్కిం అర్హతలు:
*ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అర్హులు.
*ఈ పథకం కోసం రైతులు వాళ్ళ పేరు మీద ఉన్న వ్యవసాయ భూమి వివరాలను ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేయాలి.
*ప్రస్తుతం వ్యవసాయ పంటలు పండిస్తున్న రైతులే ఈ పథకానికి అర్హులు.
* వ్యవసాయం పండించని భూములపై ఈ పథకం వర్తించదు.
*కేవలం చిన్న రైతులు, మధ్యస్థ రైతులే ఈ పథకం లబ్ది పొందుతారు.
* అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతుల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేసి ఉండాలి.

అన్నదాత సుఖీభవ స్కిం కోసం కావాల్సిన డాకుమెంట్స్
* రైతు ఆధార్ కార్డు
* రైతు బ్యాంక్ అకౌంట్ వివరాలు
* భూమి డాకుమెంట్స్: పాస్‌బుక్ జిరాక్స్ లేదా భూమి పట్టాదారు డాక్యుమెంట్ అవసరం
* రైతు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసి ఉండాలి.
*పట్టాదారు పాస్‌బుక్
అన్నదాత సుఖీభవ స్కిం ప్రయోజనాలు:
*అర్హులైన రైతుకు ప్రతి ఏడాదికి ఒకసారి ఆర్థిక సాయం అందిస్తుంది.
*ఈ స్కిం లబ్ది పొందడంతో వ్యవసాయ ఖర్చులు, పంట సాగుకి సాయం పొందవచ్చు.
*రైతులు ఈ స్కిం కోసం అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా అప్లయ్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications