Bonus Shares: కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం పూర్తి కావటంతో చాలా కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఇదే క్రమంలో కొన్ని కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు డివిడెండ్, బోనస్ షేర్లను ప్రకటిస్తున్నాయి.
ఈరోజు అన్మోల్ ఇండియా షేర్ ప్రైస్ షేర్లు ఎక్స్-బోనస్ స్టాక్‌గా మారింది. కంపెనీ ఒక్కో షేరుకు 4 బోనస్ షేర్లను అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు అందించాలని జూలై 6న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించింది. ఇందుకోసం జూలై 18ని రికార్డు తేదీగా నిర్ణయించింది. ఉచితంగా షేర్లను పొందటం కోసం చాలా మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దీంతో నేడు కంపెనీ షేర్లను కొనుగోలు చేయటంతో స్టాక్ ఇంట్రాడేలో 20 శాతం ఎగువ సర్క్యూట్‌ను తాకాయి.

గత వారంలో బోనస్ స్టాక్ 5.54 శాతం మేర క్షీణించింది. అయితే పొజిషనల్ ఇన్వెస్టర్లకు అన్మోల్ ఇండియా షేరు 2023లో ఇప్పటి వరకు 51 శాతానికి పైగా లాభాలను తెచ్చిపెట్టింది. మార్చి త్రైమాసికంలో అన్మోల్ ఇండియా నిర్వహణ ఆదాయం 18.70 శాతం పెరిగి రూ.370.13 కోట్ల స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో పన్ను తర్వాత నికర లాభం 40.18 శాతం వృద్ధితో రూ.3.16 కోట్లుగా నమోదైంది.
అన్మోల్ ఇండియా బొగ్గు వ్యాపారంలో ఉంది. ఇది ఇతర దేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటోంది. మే 27, 2023న కంపెనీ విజయ్ కుమార్‌ని మేనేజింగ్ డైరెక్టర్‌గా మళ్లీ నియమించినట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ ప్రస్తుతం దేశంలో ప్రఖ్యాత కోల్ సప్లయర్‌గా కొనసాగుతోంది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications