Success story: రూ. 600 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టాడు!
ఈ రోజుల్లో సాదాసీదా ఉద్యోగం వదిలేయాలంటేనే మనం వంద సార్లు ఆలోచిస్తాం. అలాంటిది చేతిలో ఏడాదికి రూ. 33 లక్షల ప్యాకేజీ ఇచ్చే ఉద్యోగం ఉన్నా, లేదా రూ. 600 కోట్ల విలువైన పెద్ద కంపెనీ ఉన్నా దాన్ని వదిలేసి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టడం అంటే మామూలు విషయం కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ (Ankur Warikoo) సరిగ్గా ఇదే చేశారు. ఆయన జీవితంలో తీసుకున్న కొన్ని సాహసోపేత నిర్ణయాల ఇప్పుడు ఎంతో మంది యువతకు ఇన్ స్పిరేషన్ గా మారాయి.

పీహెచ్‌డీ డ్రాపౌట్ నుంచి స్టార్టప్ వరకు..
చాలామందికి అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలని ఉంటుంది. వారికూ కూడా అమెరికాలో ఫుల్లీ ఫండెడ్ పీహెచ్‌డీ చేసే అవకాశం వచ్చింది. కానీ తనకి అది సెట్ అవ్వదని అర్థమయ్యాక, మధ్యలోనే ఆపి ఇండియా వచ్చేశారు. ఆ తర్వాత ఒక ప్రముఖ కన్సల్టింగ్ కంపెనీలో ఏటా రూ. 33 లక్షల జీతం వచ్చే ఉద్యోగం సంపాదించారు. కానీ అక్కడ కూడా ఆయన మనసు ఆగలేదు. ఆ స్థిరత్వాన్ని వదిలేసి, అన్సర్టైన్ గా ఉండే స్టార్టప్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
40 ఏళ్ల వయసులో కొత్త ఆరంభం
వారికూ 'నియర్ బై' (Nearby) అనే ప్లాట్‌ఫామ్‌ను స్థాపించి, దాన్ని రూ. 600 కోట్ల విలువైన కంపెనీగా మార్చారు. అయితే, 40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అందరూ రిటైర్మెంట్ గురించి లేదా సెటిల్ అవ్వడం గురించి ఆలోచిస్తారు. కానీ వారికూ ఆ కంపెనీ నుండి బయటకు వచ్చేసి, మళ్ళీ బూట్‌స్ట్రాప్ (సొంత పెట్టుబడితో) పద్ధతిలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. "మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టడానికి వయసుతో సంబంధం లేదు" అని ఆయన నిరూపించారు.
ఆయన నేర్చుకున్న పాఠాలు ఏమిటి?
ఈ ప్రయాణంలో వారికూ మూడు ప్రధాన విషయాలను నమ్ముతారు..
- ఆత్మవిశ్వాసం (Self-belief): మనపై మనకు నమ్మకం ఉంటే, చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మనల్ని నమ్మడం మొదలుపెడుతుంది.
- రిస్క్ తీసుకోవడం: రిస్క్ లేనిదే లైఫ్ లో గ్రోత్ ఉండదు. మనం భయపడేవన్నీ కేవలం ఊహలు మాత్రమే, ఒక్కసారి అడుగు ముందుకు వేస్తే అవే అనుభవాలుగా మారుతాయి.
- స్థిరత్వం ముఖ్యం కాదు: సేఫ్ జోన్ లో ఉంటే విజయం రాదు. కష్టకాలంలో కూడా నిలబడగలిగే ఓర్పు ఉండాలి.
ఒకప్పుడు ఆయన నిర్ణయాలను చూసి పిచ్చితనం అన్నవారే, ఇప్పుడు ఆయన సాధించిన విజయాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ సక్సెస్ స్టోరీ (success story) మనకు నేర్పేది ఒక్కటే.. జీవితంలో ఎప్పుడైనా, ఏ వయసులోనైనా కొత్తగా మొదలుపెట్టవచ్చు, దానికి కావలసిందల్లా కేవలం మనపై మనకున్న నమ్మకం మాత్రమే.
అంకుర్ వారికూ తీసుకున్న ఈ నిర్ణయాలు కేవలం వ్యాపార పరంగానే కాకుండా, వ్యక్తిగత ఎదుగుదలలో కూడా ఎంతో కీలకంగా మారాయి. మనం ఒక సేఫ్ జోన్‌లో ఉన్నప్పుడు కొత్త విషయాలను నేర్చుకోలేమని, రిస్క్ తీసుకున్నప్పుడే మనలోని అసలు సామర్థ్యం బయటపడుతుందని ఆయన నమ్ముతారు. అందుకే, 40 ఏళ్ల వయసులో అందరూ సెటిల్ అయిపోయామని అనుకునే సమయంలో, ఆయన ఒక కంటెంట్ క్రియేటర్‌గా, మెంటార్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా లక్షలాది మందికి ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, కెరీర్ గైడెన్స్ ఇస్తూ, ఒక కొత్త రకమైన సక్సెస్ స్టోరీని లిఖించారు. ఓటమి ఎదురైనా సరే, మళ్ళీ నిలబడగలననే ధైర్యం ఉంటే ఏ వయసులోనైనా అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది.


Click it and Unblock the Notifications