Ankur warikoo: రూ. 100 కోట్ల బిజినెస్‌ను మూసేసిన అంకుర్ వారికూ.. అసలు కారణం తెలిస్తే షాకవుతారు!
భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ క్రియేటర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లలో అంకుర్ వారికో (ankur warikoo) ఒకరు. ముఖ్యంగా యువతకు కెరీర్, ఫైనాన్స్, టైమ్ మేనేజ్‌మెంట్‌పై గైడెన్స్ ఇస్తూ సోషల్ మీడియాలో ఆయన చేసే వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. అయితే, తాజాగా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇంటర్నెట్‌ను ఒక్కసారిగా షేక్ చేసింది.
కేవలం ఐదేళ్లలోనే రూ. 100 కోట్ల సేల్స్ సాధించి, రూ. 25 కోట్ల నికర లాభాన్ని (Net Profit) తెచ్చిపెట్టిన తన సక్సెస్‌ఫుల్ ఆన్‌లైన్ కోర్సుల బిజినెస్‌ను పూర్తిగా మూసేస్తున్నట్లు (Shutting down) ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన 'X' (ట్విట్టర్) ఖాతాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు కార్పొరేట్ , స్టార్టప్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అంచనాలకు మించి గ్రోత్.. అయినా ఎందుకు క్లోజ్?
2020లో అంకుర్ వారికూ యువ ప్రొఫెషనల్స్ కోసం 'వెబ్‌వేద' (WebVeda) అనే ఆన్‌లైన్ స్కూల్‌ను ప్రారంభించి లైఫ్ స్కిల్స్ కోర్సులను అందించడం స్టార్ట్ చేశారు. "మేము ఊహించిన దానికంటే ఈ బిజినెస్ చాలా వేగంగా ఎదిగింది. ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఇందులో ఎన్‌రోల్ అయ్యారు. రూ. 100 కోట్ల సేల్స్ మార్కును దాటడమే కాకుండా, రూ. 25 కోట్ల ప్రాఫిట్ జనరేట్ చేశాం. కానీ, ఇకపై ఈ బిజినెస్‌ను ఇలాగే కొనసాగించడంలో నాకు ఎలాంటి అర్థం కనిపించడం లేదు (It makes no sense to continue it)" అని వారికూ రాసుకొచ్చారు. ఈ సడన్ షాక్‌కు గల పూర్తి కారణాలను మే 16 రాత్రి 8:30 గంటలకు వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.
నెటిజన్ల అనుమానాలు.. గుడ్‌బై ఆ లేక మార్కెటింగ్ గిమ్మిక్కా?
ఈ ప్రకటన చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అంకుర్ వారికూకు ఉన్న అద్భుతమైన మార్కెటింగ్ మైండ్‌సెట్ తెలిసిన వారు.. ఇది కేవలం ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా పెద్ద అనౌన్స్‌మెంట్ కోసం చేస్తున్న 'మార్కెటింగ్ గిమ్మిక్' (Marketing Gimmick) అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఒక యూజర్ "కొత్తగా ఏదైనా యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నారా?" అని అడగగా.. వారికూ "నీ నోట్లో నెయ్యి పోయ.." (Tumhare mooh mein ghee...) అంటూ హిందీలో ఫన్నీగా రిప్లై ఇచ్చారు. మరికొందరేమో రాబోయే ఆర్థిక మాంద్యం (Recession) భయాల వల్లే కోర్సుల బిజినెస్‌ను ముందే ప్యాక్ అప్ చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు.
ఎవరీ అంకుర్ వారికూ?
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 17 మిలియన్లకు (1.7 కోట్లు) పైగా ఫాలోవర్స్ బేస్ ఉన్న అంకుర్ వారికో (ankur warikoo) లైఫ్ జర్నీ చాలా ఇన్‌స్పిరేషనల్‌గా ఉంటుంది..
- చదువు & డ్రాపౌట్: ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన అంకుర్, ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఫిజిక్స్‌లో బీఎస్సీ చేశారు. ఆ తర్వాత యూఎస్‌లోని మిచిగన్ స్టేట్ యూనివర్సిటీలో ఆస్ట్రోఫిజిక్స్ (Astrophysics) లో పీహెచ్‌డీ చేయడానికి ఫుల్ స్కాలర్‌షిప్ సాధించారు. కానీ, మధ్యలోనే ఆ కోర్సు నచ్చక డ్రాపౌట్ అయి ఇండియాకు వచ్చేశారు. ఆపై ప్రతిష్టాత్మక 'ఐఎస్‌బీ' (ISB) లో ఎంబీఏ పూర్తి చేసి 'యంగ్ లీడర్ అవార్డు' అందుకున్నారు.
- స్టార్టప్ ప్రయాణం: తన కెరీర్ ప్రారంభంలో 'Gaadi.com', 'Secondshaadi.com' వంటి పోర్టల్స్ నడిపిన యాక్సెంటియమ్ వెబ్‌కు కో-ఫౌండర్‌గా ఉన్నారు. 2011లో 'గ్రూపన్ ఇండియా' (Groupon India) కు ఫౌండింగ్ సీఈఓగా మారి, ఆ తర్వాత ఆసియా పసిఫిక్ రీజియన్‌కు హెడ్‌గా వ్యవహరించారు.
- నియర్ బై సీఈఓ: 2015లో సెక్వోయా క్యాపిటల్ సాయంతో గ్రూపన్ ఇండియాను మేనేజ్‌మెంట్ బైఅవుట్ చేసి, దానిని 'nearbuy.com' గా రీబ్రాండ్ చేశారు. 2019 వరకు దానికి సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు.
2019లో సీఈఓ పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఆయన "బ్రాండ్ వారికూ" నిర్మించడంపై దృష్టి పెట్టారు. బెస్ట్ సెల్లింగ్ బుక్స్ అయిన 'Do Epic Shit', 'Make Epic Money' వంటి పుస్తకాలను కూడా ఆయన రచించారు. ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40, లింక్డ్‌ఇన్ పవర్ ప్రొఫైల్స్, ఫోర్బ్స్ టాప్ 100 డిజిటల్ క్రియేటర్ల లిస్టులో ఆయన చోటు సంపాదించుకున్నారు. ఇంతటి విజయం సాధించిన వారికూ తన రూ. 100 కోట్ల సామ్రాజ్యాన్ని ఇలా అకస్మాత్తుగా ఎందుకు వదిలేస్తున్నారనే సస్పెన్స్ మరికొద్ది గంటల్లో వీడనుంది.


Click it and Unblock the Notifications