Trending: స్టాక్స్ కాదు, రియల్ ఎస్టేట్ కాదు! ప్రపంచంలోనే అత్యుత్తమ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటో చెప్పిన అంకుర్ వారికూ!

మనలో చాలామంది డబ్బు సంపాదించాలంటే స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా బంగారంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటాం. కానీ, వీటన్నింటి కంటే గొప్ప పెట్టుబడి మరొకటి ఉందని చెబుతున్నారు ప్రముఖ ఫిన్‌ఫ్లూయెన్సర్ , 'వెబ్‌వేద' (WebVeda) వ్యవస్థాపకుడు అంకుర్ వారికూ. సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ (trending) లో ఉన్న ఈ తాజా పోస్ట్ ఎందరికో స్ఫూర్తినిస్తోంది. ఇంతకీ ఏమైందంటే..

Ankur Warikoo Earning Rs 2 Lakh Per Hour Best trending Investment Tips For Your 40s

రూ. 9 లతో మొదలైన ప్రయాణం

అంకుర్ వారికూ తన 17 ఏళ్ల వయసులో నెలకు కేవలం రూ. 400 లకే ట్యూషన్లు చెప్పేవారట. అంటే గంటకు ఆయన సంపాదన కేవలం రూ. 9 మాత్రమే. అక్కడి నుండి క్రమంగా కష్టపడుతూ తన నైపుణ్యాలను పెంచుకున్నారు. 23 ఏళ్ల వయసులో అమెరికా వెళ్ళినప్పుడు స్టైపెండ్ రూపంలో గంటకు రూ. 200 సంపాదించే స్థాయికి చేరారు. అయితే, పీహెచ్‌డీ మధ్యలోనే ఆపేసి భారత్‌కు తిరిగి వచ్చినప్పుడు ఆయన సంపాదన గంటకు రూ. 134 కి పడిపోయింది.

రిస్క్ తీసుకుంటేనే రిటర్న్స్!

వారికూ జీవితంలో తీసుకున్న అతిపెద్ద రిస్క్ ఎంబీఏ (MBA) కోసం లోన్ తీసుకోవడం. ఆ సమయంలో ఆయన సంపాదించడం పక్కన పెడితే, అప్పుల వల్ల గంటకు రూ. 33 నష్టపోయే పరిస్థితి వచ్చింది. కానీ, ఆ చదువు ఆయన జీవితాన్నే మార్చేసింది. ఎంబీఏ తర్వాత ఆయన సంపాదన గంటకు రూ. 370 నుండి రూ. 800 వరకు పెరిగింది. అయితే అక్కడితో ఆగిపోకుండా, తన సొంత స్టార్టప్ కోసం 65 శాతం జీతం తగ్గించుకుని మరీ సాహసం చేశారు. ఆ నిర్ణయం మూడేళ్ల తర్వాత ఆయన్ని గ్రూపాన్ ఇండియా (Groupon India) సీఈఓగా నిలబెట్టింది. అప్పుడు ఆయన గంటకు రూ. 4,000 సంపాదించేవారు.

తమపై తాము పెట్టుబడి పెట్టుకోవడమే అసలైన సక్సెస్

2020లో తన ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిస్థాయిలో కంటెంట్ క్రియేషన్ , వెబ్‌వేద బిజినెస్‌పై దృష్టి పెట్టారు. కేవలం కష్టపడటమే కాదు, తెలివిగా పని చేయడం (Strategically working) మొదలుపెట్టారు. ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకుని, తన పని గంటలను వారానికి 25 గంటలకు తగ్గించుకున్నారు. నేడు ఆయన సంపాదన గంటకు అక్షరాలా రూ. 2,00,000.

ఈ 30 ఏళ్ల ప్రయాణంలో తన ఆదాయం ఏటా 48 శాతం వృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. "మీరు స్టాక్స్ లేదా భూముల్లో పెట్టే పెట్టుబడి కంటే, మీపై మీరు పెట్టుకునే పెట్టుబడి (Investing in oneself) మీకు అత్యుత్తమ రిటర్న్స్ ఇస్తుంది" అని వారికూ ఇచ్చిన టిప్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ (trending) గా మారింది.

నెటిజన్ల రియాక్షన్

ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "దీర్ఘకాలిక ఆలోచన , నైపుణ్యాలు ఎప్పుడూ స్థిరమైన ఫలితాలను ఇస్తాయి" అని ఒకరు కామెంట్ చేయగా, "మీరే మీ జీవితానికి అతిపెద్ద ఆస్తి" అని మరొకరు ప్రశంసించారు. కెరీర్‌లో ఎప్పుడూ ఒకేలా వృద్ధి ఉండదని, కొన్నిసార్లు రెండడుగులు వెనక్కి వేయడం కూడా భవిష్యత్తులో పరుగు తీయడానికేనని అంకుర్ వారికూ ప్రయాణం నిరూపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+