హఠాత్తుగా అనిల్ అంబానీ కంపెనీ పేరు మార్చేశారు.. ఓహో కారణం ఇదేనా..!!
భారతీయ వ్యాపారవేత, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ నావల్ & ఇంజనీరింగ్ (RNEL) పేరును స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (SDHIL)గా మార్చారు. ధీరూభాయ్ అంబానీ చిన్న కుమారుడు అలాగే ముఖేష్ అంబానీ సోదరుడైన అనిల్ అంబానీ ఒకప్పుడు భారతీయ పరిశ్రమలో పేరు మొసినా వ్యక్తి. అతను భారతదేశంలోనే నంబర్ వన్ ధనవంతుడు కూడా. కానీ అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు నష్టాలను చవిచూడడంతో దివాళా తీసింది. ఆ పరిస్థితిలో అనిల్ అంబానీకి చెందిన ఆర్‌ఎన్‌ఇఎల్‌ను కొనుగోలు చేసిన స్వాన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ పేరును మార్చినట్లు ప్రకటించింది.
జనవరి 2 నుంచి ఈ కొత్త పేరు అమల్లోకి వస్తుందని స్వాన్ ఎనర్జీ స్టాక్ ఎక్స్ఛేంజీకి ఫైలింగ్‌లో తెలిపింది. స్వాన్ ఎనర్జీ అనేది కాంగ్లోమరేట్ కంపెనీ, అనిల్ అంబానీకి చెందిన RNEL దివాలా తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్, రియల్ ఎస్టేట్, టెక్స్‌టైల్స్ రంగాలలో విస్తరించి ఉంది, అనిల్ అంబానీకి చెందిన ఆర్‌ఎన్‌ఈఎల్‌కు సంబంధించిన కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఫెయిల్ చేయడంతో దివాళా తీసింది. అప్పుడు ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు స్వాన్ ఎనర్జీ ముందుకు వచ్చింది. దీని తరువాత డిసెంబర్ 2023లో స్వాన్ ఎనర్జీ లిమిటెడ్ 2100 కోట్లు చెల్లించి RNELని సొంతం చేసుకుంది. ఈ కొనుగోలు పూర్తయిన తర్వాత కంపెనీ ఇప్పుడు దాని పేరును మార్చుకుంది. నౌకాదళ రక్షణ, చమురు, గ్యాస్ నౌకల రంగంలో అగ్రగామిగా నిలవాలనే లక్ష్యంతో కంపెనీని రీబ్రాండింగ్ చేసి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు స్వాన్ కంపెనీ తెలిపింది.

షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్‌తో సహా భారీ ప్రాజెక్టులలో కొనసాగుతూ ఉంటుందని స్వాన్ ఎనర్జీ తెలిపింది. ఈ ప్రకటన తర్వాత స్వాన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లు గురువారం 3.6 శాతం పెరిగాయి. తాజాగా జనవరి 3న కంపెనీ ఒక షేరు రూ.751 వద్ద ట్రేడైంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23 వేల కోట్లు. 2024లో కంపెనీ రెవెన్యూ రూ.5100 కోట్లు, ప్రాఫిట్ రూ.586 కోట్లు. 2023 వరకు నష్టాల్లో ఉన్న ఈ కంపెనీ గతేడాది నుంచి లాభాల్లోకి దూసుకెళ్లింది. కంపెనీ షేర్లలో 53 శాతం ప్రమోటర్లు అలాగే దాదాపు 12 శాతం విదేశీ పెట్టుబడి కంపెనీల వద్ద ఉన్నాయి. స్వాన్ ఎనర్జీ స్టాక్ గత సంవత్సరంలో 50.75%, గత 6 నెలల్లో 21.87% అలాగే గత వారంలో 1.99% లాభపడింది.


Click it and Unblock the Notifications