Vedanta Shares: భారత మైనింగ్ వ్యాపారంలో మహారాజుగా అనిల్ అగర్వాల్ అందరికీ సుపరిచితులే. తిరుగులేని ఈ బిహారీ వ్యాపారవేత్త తాజాగా తన ఇన్వెస్టర్లకు శుభవార్త చెప్పారు.
వేదాంత సంస్థ తాజాగా రెండవ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇన్వెస్టర్లకు కంపెనీ ఒక్కో షేరుపై ఏకంగా రూ.11 చొప్పున డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. దీనికోసం రికార్డు తేదీని ఫిక్స్ చేసింది. కంపెనీ చేసిన అతిపెద్ద ప్రకటనతో సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి స్టాక్ 1.34 శాతం పెరిగి రూ.260.60 వద్ద ఉంది. అయితే నేడు ఉదయం 9.50 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో రూ.262.40 వద్ద స్టాక్ తన ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం డిసెంబర్ 18న మార్కెట్ ముగిసిన తర్వాత.. అర్హతగల పెట్టుబడిదారులకు రూ.1 ముఖ విలువ కలిగిన షేర్‌పై 1100 శాతం డివిడెండ్ ఇవ్వబడనుంది. రెండవ మధ్యంతర డివిడెండ్ కోసం కంపెనీ డిసెంబర్ 27, 2023ను రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. అంటే ఈ తేదీ నాటికి షేర్లు కలిగి ఉన్న అర్హులైన ఇన్వెస్టర్లకు డివిడెండ్ సొమ్ము చెల్లించబడుతుంది. దీనికి ముందర మే నెలలో కంపెనీ తన పెట్టుబడిదారులకు ఒక్కో షేరుపై రూ.18.50 డివిడెండ్ చెల్లించింది. పైగా ఏప్రిల్ నెలలో అర్హతగల ఇన్వెస్టర్లకు రూ.20.50 డివిడెండ్ ఒక్కో షేరుపై ప్రకటించింది.
అంటే మెుత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం డివిడెండ్ రూపంలోనే ఒక్కో షేరుపై కంపెనీ రూ.50 పెట్టుబడురులు అందుకున్నారు. గత నెలలో వేదాంత షేరు ధరలు దాదాపు 9 శాతం పెరిగాయి. అలాగే గత ఏడాది కాలంలో ఈ షేరు 17 శాతం పడిపోయింది. 5 ఏళ్లలో వేదాంత కేవలం 30 శాతం రాబడిని ఇవ్వడంలో విజయం సాధించింది. వేదాంత 52 వారాల గరిష్ట ధర రూ.340.75 ఉండగా.. 52 వారాల కనిష్ట ధర రూ.207.85గా ఉంది. దీంతో కంపెనీ బెస్ట్ డివిడెండ్ స్టాక్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంటే రికార్డు తేదీ లోపు షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు కనకవర్షం కురవబోతోంది.


Click it and Unblock the Notifications