న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL)ను కొనుగోలు చేయడానికి అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూప్ ఆసక్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో 8 బిలియన్ డాలర్లను సమీకరించాలని భావిస్తోంది. మైనింగ్ నుండి ఆయిల్ వరకు వివిధ వ్యాపారాల్లో ఉన్న వేదాంత రిసోర్సెస్ నిధుల సమీకరణ కోసం ఇప్పటికే బ్యాంకులతో చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. జేపీ మోర్గాన్‌తోను చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని తెలుస్తోంది.

52.98 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి
BPCLలో 52.98 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు వేదాంత ఆసక్తి చూపిస్తోంది. EOI కూడా దాఖలు చేసినట్లుగా చెబుతున్నారు. పదేళ్ల క్రితం వేదాంత 8.67 బిలియన్ డాలర్లకు చమురు ఉత్పత్తి కంపెనీ కెయిర్న్ ఇండియాను దక్కించుకుంది. రాజస్థాన్‌లో చమురు క్షేత్రాల నుండి కెయిర్న్ ఇండియా చమురును వెలికితీస్తుంది. పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాలను ఉత్పత్తి చేసేందుకు BPCL నిర్వహిస్తోన్న చమురు శుద్ధి కర్మాగారాలలో రాజస్థాన్‌లో ఉత్పత్తి చేసిన చమురును వినియోగిస్తారు. BPCL అక్వైజేషన్ దేశంలో మరింత విస్తరణకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

BPCLకు దిగ్గజాలు దూరం
బీపీసీఎల్ కొనుగోలుకు ఇతర చమురు రంగ దిగ్గజాలు దూరంగా ఉన్నాయి. ఇది ప్రతిబంధకంగా మారిందని చెబుతున్నారు. సంప్రదాయ ఇంధనం నుండి ప్రపంచం క్రమంగా దూరం జరుగుతోంది. ఇప్పటికే విద్యుత్ ఉపయోగం దిశగా అన్ని దేశాలు, ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీపీసీఎల్‌ను విక్రయిస్తున్నారు. వేదాంతతో పాటు అపోలో గ్లోబల్, ఐ-స్క్వేర్డ్ క్యాపిటల్ ఆర్మ్ థింగ్ గ్యాస్ మంగళవారం బిడ్స్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ బిడ్స్‌ను తనిఖీ చేసి డెలాయిట్ సంస్థ రూపొందించిన నివేదికపై ఈ అత్యున్నత సంఘం చర్చిస్తుందని చెబుతున్నారు.

రూ.47,000 కోట్ల వరకు రావొచ్చు
BPCLలో వాటా విక్రయానికి గతేడాది నవంబర్‌లో ఆమోదం లభించింది. అప్పటి నుంచి చూస్తే, షేర్ ధర 20 శాతం మేర క్షీణించింది. బీఎస్ఈలో మంగళవారం బీపీసీఎల్ షేర్ రూ.397 వద్ద ముగిసింది. దీని ప్రకారం 52.98 శాతం వాటాకు కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ.47,000 కోట్లు లభిస్తాయని అంచనా. వాటాను కొనుగోలు చేసిన ఏ కంపెనీ అయినా మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ఓపెన్ ఆఫర్ కోసం మరో రూ.22,800 కోట్లు వెచ్చించాల్సి రావొచ్చు. దేశంలో 2వ అతిపెద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ BPCL. భారత ముడి చమురు రిఫైనరీలో బీపీసీఎల్ వాటా 15.33 శాతంగా ఉంది. ఇంధన మార్కెటింగ్‌లో ఈ కంపెనీ మార్కెట్ వాటా 22 శాతంగా ఉంది. కంపెనీకి ముంబై (మహారాష్ట్ర), కొచ్చి(కేరళ), బినా(మధ్యప్రదేశ్), నుమాలిఘర్(అసోం)లలో నాలుగు రిఫైనరీలు ఉన్నాయి. ఇక్కడ వార్షిక చమురు శుద్ధి సామర్థ్యం 35.3 మిలియన్ టన్నులు. కంపెనీ మొత్తం 17,355 పెట్రోల్ పంపులు, 6,159 ఎల్పీజీ డీలర్లు, 61 విమానయాన ఇంధన స్టేషన్లను నిర్వహిస్తోంది.
ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్‌లోని బినా రిఫైనరీ ప్రాజెక్టులో ఒమన్ ఆయిల్ కంపెనీకి ఉన్న వాటా కొనుగోలు చేసే అంశాన్ని 17న జరిగే బోర్డు సమావేశంలో BPCL పరిశీలించనుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications