Angry CEO: ఒక్క దెబ్బతో కంపెనీలో ఉద్యోగులను తొలగించిన సీఈవో.. ఏమైందంటే?
CEO Fired Employees: కంపెనీ యజమానికి కోపం తెప్పిస్తే జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుందనే విషయాన్ని మరోసారి రుజువైంది. ఈరోజుల్లో ఉద్యోగులు సైతం యజమానులు చెప్పే వాటికి విరుద్ధంగా వ్యవహరించటం ప్రస్తుత పరిస్థితులకు దారితీస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సీఈవో చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే అమెరికాలోని సంగీత వాయిద్యాల కంపెనీ సీఈవో తన కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 99 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. అయితే అసలు విషయం ఏమిటంటే వారు చేసిన తప్పల్లా సీఈవో నిర్వహించిన సమావేశానికి హాజరు కాకపోవటమే. వాస్తవానికి సదరు సీఈవో నిర్వహించిన మీటింగులో మెుత్తం ఉద్యోగుల్లో కేవలం 11 మంది మాత్రమే హాజరు కావటంతో ఆగ్రహానికి గురై ఈ చర్యలు తీసుకున్నట్లు కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి రెడిట్‌లో శ్లాక్ సంభాషణ వివరాలను పొందుపరిచాడు. తాను సదరు కంపెనీలో ఇంటర్న్ గా చేరిన కొద్ది గంటల్లోనే ఇలా జరగటంతో ఉద్యోగం కోల్పోయినట్లు అందులో వెల్లడించాడు.

మెుత్తం సదరు సంగీత వాయిద్యాల విక్రయ కంపెనీలో 110 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కేవలం సీఈవో సమావేశానికి 11 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడైంది. ఉద్యోగులు తమ పనిని సీరియస్ గా తీసుకోకపోవటంతో సీఈవో ఆగ్రహించినట్లు శ్లాక్ సంభాష చూస్తే అర్థం అవుతోంది. తాను నిర్వహించిన సమావేశానికి ఉద్యోగులు హాజరుకాకపోవడంతో కలత చెందిన సీఈవో వారికి ఒక సీరియస్ మెసేజ్ పెట్టాడు. సమావేశానికి హాజరుకాకపోవటాన్ని అధికారిక నోటీసును సర్వ్ చేసినట్లు పరిగణించబడుతుందని చెప్పాడు. మీరందరూ విఫలమైనందుకు తొలగించబడుతున్నారని తేల్చి చెప్పేశాడు. కాంట్రాక్ట్‌లో భాగంగా మీరు హాజరు కావాల్సిన, పని చేయాల్సిన సమావేశాలకు హాజరు కావడంలో విఫలమయ్యారంటూ సీఈవో తన సందేశంలో పేర్కొన్నాడు.
దీంతో కంపెనీకి ఉద్యోగులకు మధ్య ఉన్న ఒప్పందాలన్నిటినీ తాను రద్దు చేస్తున్నట్లు సీఈవో స్పష్టం చేశాడు. దయచేసి మీ వద్ద ఉన్నదంతా తిరిగి ఇవ్వండి, అన్ని ఖాతాల నుంచి సైన్ అవుట్ చేయండి అలాగే వెంటనే ఈ స్లాక్ అకౌంట్ నుండి మిమ్మల్ని మీరు తొలగించుకోండని కోపంగా ఉన్న సీఈవో తన ఉద్యోగులకు సూచించాడు. సమావేశానికి హాజరుకాకపోవడం ద్వారా తమ ఉద్యోగులు తమకు ఇచ్చిన అవకాశాన్ని లైట్ తీసుకున్నారన్నాడు. జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, కష్టపడి పనిచేయడానికి, ఎదగడానికి అవకాశం ఇచ్చానని కానీ ఉద్యోగులు దానిని సీరియస్‌గా తీసుకోవటం లేదని ఈ ఘటన ద్వారా వెల్లడైందని సదరు సీఈవో అభిప్రాయపడ్డాడు. సిబ్బందిలో దాదాపు 90 శాతం మంది మీటింగ్ ఎగ్గొట్టడంపై రెడిట్ యూజర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ సీఈవో ఇలా చేసి ఉంటారని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications