ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైయస్ఆర్ కడప జిల్లాలో గండికోట వద్ద 1800 మెగావాట్ల సామర్థ్యం గల కొత్త పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ త్వరలో రూపుదిద్దుకోనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ఆస్ట్రియాకు చెందిన అంతర్జాతీయ సాంకేతిక సంస్థ ఆండ్రిట్జ్ (ANDRITZ) ఆర్డర్‌ను అందుకుంది. ఈ ప్రాజెక్ట్‌ను భారతదేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సంస్థగా పేరుపొందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) అమలు చేస్తోంది.
ఈ ఒప్పందం ప్రకారం.. ఆండ్రిట్జ్ అత్యాధునిక రివర్సిబుల్ పంప్ టర్బైన్లు, మోటార్-జనరేటర్లు, అవసరమైన ఎలక్ట్రోమెకానికల్ పరికరాలు సరఫరా చేస్తుంది. అలాగే, యూనిట్ల రూపకల్పన, తయారీ, సంస్థాపన, పరీక్ష, అనుబంధ సహాయక పరికరాల నిర్వహణ బాధ్యత కూడా ఆండ్రిట్జ్ పరిధిలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లోని పరికరాలు భారతదేశంలో ఉన్న ఆండ్రిట్జ్ తయారీ సౌకర్యాల్లోనే ఉత్పత్తి చేయనున్నారు. దీనికి వారి ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్ సాంకేతిక మద్దతు ఇవ్వనుంది
భారతదేశం పునరుత్పాదక ఇంధనంలో ముందంజలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో.. Gandikota ప్రాజెక్ట్ ప్రాముఖ్యం మరింత పెరిగింది. సౌర, పవన శక్తి వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ, వాటి అస్థిరతను సమతుల్యం చేయడానికి పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే 1800 మెగావాట్ల గండికోట ప్రాజెక్ట్ భారతకు సరికొత్త ఊఫు తీసుకురానుంది.

కాగా AGEL తరఫున ఆండ్రిట్జ్‌కు వచ్చిన మూడవ ప్రధాన ఆర్డర్. 2023లో 500 మెగావాట్ల చిత్రావతి ప్రాజెక్ట్, అలాగే 2024లో 1500 మెగావాట్ల తరాలి ప్రాజెక్ట్ కోసం కూడా ఆండ్రిట్జ్‌ను ఎంపిక చేసింది. గండికోట ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన ఈ కొత్త ఒప్పందం ఆండ్రిట్జ్ నైపుణ్యానికి మరోసారి గుర్తింపునిచ్చింది. ఆర్డర్ విలువ మూడు అంకెల మిలియన్ యూరోల అత్యల్ప శ్రేణిలో ఉందని సమాచారం. ఇది 2025 రెండవ త్రైమాసికంలో ఆండ్రిట్జ్ ఆర్డర్ బుక్‌లో చేర్చబడింది. దీని ద్వారా ఆండ్రిట్జ్ భారత జలవిద్యుత్ రంగంలో తన స్థానం మరింత బలోపేతం చేసుకోనుంది.
ఆండ్రిట్జ్ ప్రస్తుతం భారతదేశంలో ఐదు కొత్త పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల అమలులో నిమగ్నమై ఉంది. గండికోట ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి అయితే, ఇది భారత జలవిద్యుత్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనుంది. పునరుత్పాదక ఇంధన రంగంలో విశ్వసనీయ భాగస్వామిగా నిలిచిన ఆండ్రిట్జ్, గ్రీన్ ట్రాన్సిషన్‌కు కావలసిన సాంకేతిక పరిష్కారాలను అందిస్తూ దేశ భవిష్యత్తు శక్తి భద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది.
1852లో స్థాపించబడిన ఈ ఆస్ట్రియన్ సంస్థ ప్రస్తుతం 80 దేశాలలో 280 ప్రదేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాదాపు 30 వేల ఉద్యోగులతో ఆండ్రిట్జ్ పల్ప్, కాగితం, లోహాలు, పర్యావరణం, వంటి వాటిల్లో కార్యకలాపాలను సాగిస్తోంది. ముఖ్యంగా జలవిద్యుత్ రంగంలో విశేష అనుభవాన్ని కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 492 గిగావాట్లకు పైగా జలవిద్యుత్ సామర్థ్యాన్ని సంస్థ ఇప్పటికే అందించింది. గ్రీన్ ఎనర్జీ మార్గంలో దూసుకుపోతున్న భారతదేశానికి, ఆండ్రిట్జ్ సహకారం ఒక పెద్ద బలమని చెప్పవచ్చు. గండికోట ప్రాజెక్ట్ భవిష్యత్ తరాలకు స్థిరమైన విద్యుత్‌ను అందించడానికి దోహదపడనుంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications