ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల జాతర: 5 ఏళ్లలో 20 వేల స్టార్టప్‌లు, లక్ష కొలువులు.. వీరికి పండగే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని కొత్త రాజధాని నగరంగా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది, అలాగే ఈ నగరాన్ని మెట్రో నగరంగా మాత్రమే కాకుండా స్టార్టప్ హబ్‌గా కూడా తీర్చిద్దిద్దనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఐటీ కంపెనీలు ఇంకా స్టార్టప్‌లను ఆకర్షించే లక్ష్యంతో కొత్త స్టార్టప్ పాలసీని ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లను ప్రారంభించి లక్ష మందికి ఉపాధి అవకాశాలను సృష్టించే లక్ష్యంతో ప్రభుత్వం 'ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29'ను ప్రారంభించింది. ఈ స్టార్టప్ పాలసీని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ఐటీఈ&సీ) విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ భాస్కర్ కడమనేని ప్రకటించారు.

AndhraPradesh government weans away Rs 9700 cr investments from other southern states to create 5 lakh jobs

అంతేకాదు మహిళా వ్యవస్థాపకుల స్టార్టప్‌లకు భారీ ప్రోత్సాహాన్ని కూడా అందిస్తుంది. కొత్త స్టార్టప్ పాలసీలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అండ్ దివ్యాంగులకు కూడా ప్రాధాన్యత ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 6,658 స్టార్టప్‌లు ఉండగా, వాటిలో 1,158 మహిళలు ప్రారంభించినవే. వీటిలో 2,400 స్టార్టప్‌లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT)లో రిజిస్టర్ చేయబడ్డాయి. 2015 ప్రకారం 1.5 లక్షల స్టార్టప్‌లు జాతీయ స్థాయిలో 120% వార్షిక వృద్ధి రేటుతో ఉన్నాయి. ఇందులో 80 శాతం వివిధ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.

స్టార్టప్ సిటీగా మారనున్న తిరుపతి: స్టార్టప్ హబ్‌లను ప్రారంభించడానికి అయ్యే అధిక ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఆరు నగరాలను స్టార్టప్ హబ్‌లుగా అభివృద్ధి చేయడమే ఈ పాలసీ ముఖ్య లక్ష్యం. ఇందుకు విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి, అనంతపురం, కర్నూలు నగరాలను స్టార్టప్ నగరాలుగా అభివృద్ధి చేయనున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 46 స్టార్టప్ ఇంక్యుబేటర్లు ఉన్నాయి. వాటిలో 9 ప్రభుత్వ రన్ చేస్తుంది. ఒకటి ప్రైవేట్ సంస్థ అండ్ మిగిలినవి ప్రైవేట్ యూనివర్సిటిలు అలాగే కాలేజెస్ ద్వారా నిర్వహిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఆరు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఉన్నాయి.

*ఆంధ్ర యూనివర్సిటీ: IoT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), AI

* శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీ: గ్రామీణ పునరుద్ధరణ

* పోర్టుల మంత్రిత్వ శాఖ, కాకినాడ: మారిటైమ్ షిప్పింగ్

* కల్పతరు STPI, విశాఖపట్నం: ఇండస్ట్రీ 4.0

* ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్: బయోటెక్, వైద్య పరికరాల తయారీ

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఐటీ స్టార్టప్ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా అతని కుమారుడు, రాష్ట్ర ఐటీ & విద్యా మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉపాధిపై నిన్న జరిగిన కేబినెట్ సబ్-కమిటీ సమావేశంలో ప్రసంగిస్తూ ఇప్పటివరకు సంతకం చేసిన అగ్రిమెంట్లు రూ.8.73 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా 5,27,824 ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని కూడా నారా లోకేష్ వెల్లడించారు.

Take a Poll

ఉద్యోగాల సృష్టిని వేగవంతం చేయడానికి వ్యవస్థాగత సంస్కరణలు అవసరం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానించాలని లోకేష్ అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు టిజి భరత్, గోటిపాటి రవికుమార్, పి. నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, సీనియర్ అధికారులు అజయ్ జైన్, యువరాజ్, కడమేని భాస్కర్, ప్రవీణ్ కుమార్, సాయికాంత్ వర్మ, అభిషేక్ కిషోర్ పాల్గొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+