Telugu States airports suffer massive losses: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిర్వహిస్తున్న ఏడు విమానాశ్రయాలు గత దశాబ్దంలో భారీ ఆర్థిక నష్టాలను చవిచూశాయని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో పౌర విమానయాన శాఖ అందించిన తాజా సమాచార ప్రకారం.. ఏపీ, తెలంగాణలోని బేగంపేట, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి తదితర ఏడువిమానాశ్రయాలు కలిపి గత 10 ఏళ్లలో మొత్తం రూ.1,861 కోట్ల నష్టాన్ని నమోదు చేశాయని తెలిపింది. అంటే సగటున ప్రతి సంవత్సరం రూ.150 కోట్లకు పైగా నష్టం ఈ విమానాశ్రయాలు నడపడం ద్వారా వాటిల్లుతోంది.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పనిచేయని వరంగల్ విమానాశ్రయం కూడా 2015-16 నుంచి రూ.5 కోట్ల వరకు నష్టాలని నమోదు చేసిందని రాజ్యసభలో పౌర విమానయాన శాఖ తెలిపింది . అదే సమయంలో బేగంపేట విమానాశ్రయం ఒక్కటే దాదాపు రూ.564.97 కోట్లు నష్టాలను నమోదు చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ (రూ.673.91 కోట్లు), అగర్తల (రూ.605.23 కోట్లు) తర్వాత మూడవ అత్యధిక నష్టపోయిన విమానాశ్రయంగా నిలిచిందని ప్రభుత్వ నివేదిక తెలిపింది. మొత్తంగా చూసుకున్నట్లయితే.. AAI నిర్వహిస్తున్న 81 విమానాశ్రయాల్లో గత దశాబ్దంలో రూ.10,000 కోట్లకు పైగా నష్టాలు నమోదయ్యాయి.
2008లో బేగంపేట విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలను RGIA (శంషాబాద్) ప్రారంభమైన తర్వాత AAI నిలిపివేసింది. అప్పటి నుంచి ఇది సాధారణ విమానయాన, సైనిక విమానాలకు మాత్రమే సేవలు అందిస్తోంది. ప్రయాణికుల రద్దీ లేకపోవడంతో 2012-13 నుంచి 2014-15 మధ్య కాలంలోనే AAI అక్కడ రూ.84.16 కోట్ల కార్యాచరణ నష్టాన్ని నివేదించింది.

పరిశీలనలో ఉన్న మరికొన్ని విమానాశ్రయాలులో వాణిజ్య విమానాల రాకపోకలు లేకపోవడంతో మెయింటెనెన్స్ చేయాల్సి రావడంతో నష్టాలు వస్తున్నాయి. కొన్నింటిలో కేవలం VIP విమానాలే ల్యాండింగ్ అవుతున్నాయి. ఈ విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండటమే కాక.. నాన్-ఏరోనాటికల్ ఆదాయ వనరులు (ఆడ్స్, షాప్స్, పార్కింగ్ మొదలైనవి) కూడా చాలా పరిమితంగా ఉండటంతో ఆదాయం కనపడకపోగా నష్టం ఎక్కువగా పెరుగుతోంది.
విమానాశ్రయాల నిర్వహణలో రన్‌వే మెయింటెనెన్స్, అగ్నిమాపక చర్యలు, భవన నిర్వహణ, సిబ్బంది జీతాలు వంటి వాటికి భారీగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటం వలన ఈ ఖర్చులన్నీ నేరుగా నష్టాల కింద మారుతున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ అధ్యక్షుడు కెప్టెన్ సి.ఎస్. రాంధవా తెలిపారు.ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే.. ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయాలన్నారు. అలాగే టైర్-II, టైర్-III నగరాలతో వీటిని అనుసంధానించాలని కోరారు. అందుబాటులో ఉన్న విమానాశ్రయాలను పునరుద్ధరించి సాధ్యమైనంత వరకూ వాణిజ్య కార్యకలాపాలు పెంచాలని ఆయన చెబుతున్నారు.
ఇదిలా ఉంటే AAI ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని వరంగల్ విమానాశ్రయంపై పలుమారు భూమిని అప్పగించాలని కోరింది. ఇప్పుడున్న దానికి అదనంగా మరో 253 ఎకరాల భూమి అప్పగించాల్సిందిగా కోరింది. ప్రస్తుతం కలిగిన 700 ఎకరాలతో మాస్టర్ ప్లాన్ రెడీ చేసినప్పటికీ, విస్తరణకు కావాల్సిన భూమిని ఇంకా ప్రభుత్వం AAIకి అప్పగించలేదు. భూమి అందుబాటులోకి వచ్చిన వెంటనే విమానాశ్రయ ప్రయోజనాల కోసం పూర్తిస్థాయి అభివృద్ధి చేపట్టబడుతుందని అధికారులు పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications