ఆంధ్రప్రదేశ్‌లో టాప్ కంపెనీలు రూ. 53 వేల కోట్ల పెట్టుబడులు.. 30 ప్రాజెక్టులకు SIPB ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పదవ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం గురువారం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు జరిగాయి. ఈ సమావేశంలో మొత్తం రూ. 53,922 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా.. 30 ప్రాజెక్టుల ద్వారా 83,437 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.
ప్రతి నెల ప్రాజెక్టుల పురోగతిని స్వయంగా తానే పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల గ్రౌండింగ్, అమలు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. Speed of Doing Business విధానంతో పెట్టుబడిదారులకు త్వరితగతిన అనుమతులు, సమర్థవంతమైన సౌకర్యాలు అందించడమే లక్ష్యమని సీఎం తెలిపారు.

మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికిల్ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సమావేశంలో సీఎం తెలిపారు. చిత్తూరు, రాయలసీమ జిల్లాల్లో మామిడి వంటి స్థానిక పంటలకు విలువను జోడించే యూనిట్లను ఆహార ప్రాసెసింగ్ లో భాగంగా ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో MSME పార్కులను అభివృద్ధి చేసి, వాటిని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లతో అనుసంధానించాలని సీఎం ప్రతిపాదించారు.ఐటీ, పర్యాటకం, మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.
ప్రధాన ప్రాజెక్టులు, ఉద్యోగాలు విషయానికి వస్తే.. రూ. 197 కోట్లతో మడకశిర HFCL ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 870 ఉద్యోగాలు రానున్నాయి. ఇక చిత్తూరులో అపోలో టైర్స్ ఏర్పాటు కానుంది. రూ. 1110 కోట్ల భారీ పెట్టుబడులతో కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా 500 ఉద్యోగాలు రానున్నాయి. కృష్ణపట్నంలో రూ. 1,843 కోట్లతో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ టెక్ పార్క్ రానుంది. దీని ద్వారా 19 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక రాయలసీమలో మరో జిల్లా అనంతపురంలో రూ. 2 వేల కోట్లతో సెరెంటికా రెన్యూవబుల్స్ ఏర్పాటు కానుంది. తద్వారా 300 ఉద్యోగాలు రానున్నాయి.
ఇక మరో జిల్లా పాడేరులో 15,455 కోట్లుతో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఏర్పాటు చేయనుంది. 8,400 ఉద్యోగాలు రానున్నాయి. కడపలో రూ. 5,050 కోట్లుతో చింతా గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు కానుంది. 8,400 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే రాష్ట్రంలో వేలాది యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా ప్రాంతీయ అభివృద్ధి సమతౌల్యం సాధ్యం కానుంది.
గత ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు, తిరుమల సమీపంలో హోటల్ నిర్మాణానికి భూమి కేటాయించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని వ్యాఖ్యానించారు. NDA ప్రభుత్వం వచ్చాక ఆ ప్రాజెక్టును ప్రత్యామ్నాయ ప్రదేశానికి మార్చామని, వైయస్ఆర్‌సిపి చేస్తున్న విమర్శలు నిరాధారమని ఆయన పేర్కొన్నారు.SIPB ఆమోదాలు కేవలం పెట్టుబడులకే పరిమితం కావు. పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే.. Andhra Pradesh భవిష్యత్ పరిశ్రమల పునాదులు, యువతకు ఉపాధి మార్గాలుగా నిలవనున్నాయి.


Click it and Unblock the Notifications