ఈరోజు న్యూ ఢిల్లీలో జరగనున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఇప్పటికే రాజకీయ వేడి మొదలైంది. ఎనిమిది ప్రతిపక్ష రాష్ట్రాలు రెవెన్యూ రక్షణ కోరుతుండగా, ఆంధ్రప్రదేశ్ మాత్రం కేంద్రం ప్రతిపాదనల పక్కన నిలిచింది. ఈ మీటింగ్‌లో నిర్ణయాలు కేవలం ట్యాక్స్ రేట్లకే పరిమితం కావు, రాష్ట్రాల రాజకీయ-ఆర్థిక సంబంధాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి.

ఎనిమిది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఒకే మాట చెబుతున్నాయి "జీఎస్టీ స్లాబ్‌లను మార్చడం బాగానే ఉంది, కానీ దాంతో మాకు వచ్చే ఆదాయ నష్టం ఎవరు భరిస్తారు?" అని. ఉదాహరణకు, ఝార్ఖండ్ ఆర్థిక మంత్రి రాధాకృష్ణ కిషోర్ స్పష్టం చేశారు "కేంద్రం పరిహార హామీ ఇస్తేనే మేము అంగీకరిస్తాం. లేకపోతే మా రాష్ట్రానికి రూ.2,000 కోట్ల నష్టం వస్తుంది" అని. హిమాచల్ ప్రదేశ్ ప్రతినిధి కూడా "ముందుగా చర్చిద్దాం, తర్వాతే ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం" అని చెప్పారు.
ఇక మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం కేంద్రం ప్రతిపాదనల పక్కన నిలబడ్డారు. ఆయన మాటల్లో "స్టీల్, సిమెంట్‌పై జీఎస్టీ రేట్లు తగ్గితే ప్రభుత్వం, ప్రజలపై భారమూ తగ్గుతుంది. ధరలు పడిపోతాయి. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ రివైవల్‌కి తోడ్పడతాయి కాబట్టి, మేము కేంద్రానికి పూర్తి మద్దతు ఇస్తాం" అని అన్నారు.
అసలా ఆ 8 రాష్ట్రాలు జీఎస్టీ 2.0కి ఎందుకు ఒప్పుకోవడంలేదు అనడానికి ముఖ్య కారణం రెవెన్యూ లోటు భయమే. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న 12% & 28% ట్యాక్స్ స్లాబ్‌లను తీసేసి, అన్ని వస్తువులను 5% లేదా 18%కి మార్చేస్తే, కొన్నిరాష్ట్రాలకు వచ్చే పన్ను ఆదాయం తగ్గిపోతుంది. ముఖ్యంగా మైనింగ్, స్టీల్, సిమెంట్ లాంటి ఉత్పత్తులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఇది పెద్ద నష్టంగా మారుతుంది. ఆదాయం తగ్గితే రాష్ట్ర ప్రభుత్వాలు తమ వెల్ఫేర్ స్కీమ్స్, సబ్సిడీలు, అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగించడానికి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే రాష్ట్రాలు నేరుగా కేంద్రం హామీ కోరుతున్నాయి.
ఇంకో సమస్య ఏమిటంటే, 2017లో జీఎస్టీ మొదలైనప్పుడు కేంద్రం "మీకు నష్టం వస్తే మేము 5 సంవత్సరాల పాటు కాంపెన్సేషన్ ఇస్తాం" అని హామీ ఇచ్చింది. ఆ హామీ 2022లో పూర్తయిపోయింది. ఇప్పుడు కొత్త మార్పులతో నష్టం వస్తే కేంద్రం నుంచి ఎలాంటి పరిహారం వస్తుందో స్పష్టత లేదు. ఈ అనిశ్చితి కారణంగానే రాష్ట్రాలు వెనుకడుగు వేస్తున్నాయి.
జీఎస్టీ స్లాబ్‌లలో ఏమేం మార్పులు?
ఈ మీటింగ్‌లో ప్రధాన చర్చ జీఎస్టీ రేట్లు రేషనలైజేషన్ గురించే. ఇప్పటి 12% & 28% స్లాబ్‌లను తీసేసి, ఎక్కువ వస్తువులను 5% లేదా 18% కేటగిరీల్లోకి మార్చడం. "సిన్ గూడ్స్" అంటే టోబాకో, ఆల్కహాల్ వంటి వాటిపై కొత్తగా 40% ట్యాక్స్ పెట్టడం. అదనంగా, ప్రి-ఫిల్డ్ రిటర్నులు, ఆటోమేటెడ్ రీఫండ్లు లాంటి సింపుల్ సిస్టమ్స్‌ను కూడా వచ్చే సంవత్సరం అక్టోబర్‌లో అమల్లోకి తేవాలని ప్లాన్ ఉంది.
మొత్తానికి, కేంద్రం తీసుకొస్తున్న జీఎస్టీ రిఫార్మ్స్ దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ బూస్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ, రాష్ట్రాలు మాత్రం "మా ఆదాయం తగ్గిపోతే ఏమవుతుంది?" అనే ప్రశ్నతోనే ఈ సమావేశానికి వెళ్తున్నాయి. ఇక చూడాలి, రాష్ట్రాల ఆందోళనలకు పరిష్కారం దొరుకుతుందా? లేక జీఎస్టీ రిఫార్మ్స్‌పై మరింత రాజకీయ వాదోపవాదాలు రగులుతాయా?
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications