విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు తిరోగమనంలో ఉందా అంటే ఆర్థిక గణాంకాలు అవుననే చెబుతున్నాయని వార్తలు వస్తున్నాయి. సంక్షేమ పథకాలు సహా వివిధ అంశాల కారణంగా గత ఏడాది కంటే ఖర్చులు పెంచుకోవాల్సిన పరిస్థితులు. కానీ ఆర్థిక పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెలతో ముగిసిన 8 నెలల కాలంలోని ఆర్థిక గణాంకాల ప్రకారం...

వీటికే ఖర్చులు పరిమితం
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, ప్రభుత్వం (గత) తెచ్చిన అప్పులపై వడ్డీలు, అసలు చెల్లింపు, ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు, కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వ ఖర్చులు పరిమితం అవుతున్నాయి. కీలక సాగునీటి ప్రాజెక్టులు, దీర్ఘకాలంలో ప్రయోజనం కల్పించే మూలధన వ్యయం నామమాత్రంగా మారిందట. ఈ ఆర్థిక సంవత్సరంలో నిధుల లేమి కారణంగా ఒక్క సాగునీటి ప్రాజెక్టులోను పనులు సరిగా చేపట్టింది లేదని వార్తలు వస్తున్నాయి.

గత ఏడాది కంటే వెనుకబడింది
సాధారణంగా ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు బడ్జెట్ అంచనాలు పెరుగుతాయి. ఆదాయం, ఖర్చులు కూడా పెరుగుతాంటాయి. కానీ ఏపీ ఆర్థిక సంవత్సరం మాత్రం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం వెనుకబడిందని గణాంకాలే చెబుతున్నాయని పేర్కొంటున్నాయి.

2018తో పోలిస్తే 2019లో వివిధ ఆదాయాల్లో తగ్గుదల ఇలా..
2018-19 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి జీఎస్టీ ఆదాయం రూ.21,007 కోట్లు అయితే 2019-20 ఆర్థిక సంవత్సరంలో అదే నెల నాటికి ఇది రూ.16,786 కోట్లుగా ఉంది. అమ్మకపు పన్ను రూ.14,553 కోట్లు అయితే రూ.13,748 కోట్లకు, కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాయం రూ.13,800 కోట్లు కాగా ఇప్పుడు రూ.10,,511 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాలు రూ.13,416 కోట్ల నుంచి రూ.11,314 కోట్లకు, ఎక్సైజ్ పన్ను రూ.4,536 కోట్ల నుంచి రూ.3,341 కోట్లకు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రూ.3,667 కోట్ల నుంచి రూ.3,636 కోట్లకు, పన్నేతర ఆధాయం రూ.2,921 కోట్ల నుంచి రూ.1,936 కోట్లకు, భూమి పన్ను రూ.30 కోట్ల నుంచి రూ.15 కోట్లకు తగ్గంది.

గత ఏడాదితో పోలిస్తే ఎంత తగ్గిందంటే
వివిధ రూపాల్లో నవంబర్ నాటికి ప్రభుత్వ ఆదాయం రూ.98,790 కోట్లు వచ్చింది. గత ఏడాది మాత్రం రూ.1,08.700 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఆదాయం తగ్గడంతో ఖర్చు కూడా తగ్గింది. ఆర్థిక కార్యకలాపాలు, సేల్స్, కొనుగోళ్లు తగ్గడంతో ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు కూడా భారీగా తగ్గాయి. గత ఏడాది కంటే రూ.10వేల కోట్ల ఆదాయం తగ్గింది.

ఎక్కువ ఖర్చు వీరికే..
వచ్చిన ఆదాయంలో ఎక్కువ మొత్తం ఉద్యోగుల వేతనాలు, పెన్షన్స్ కోసం కేటాయించవలసి వచ్చింది. ఎనిమిది నెలల కాలంలో దాదాపు రూ.35వేల కోట్లు వీటి కోసమే ఖర్చు చేశారు. వడ్డీలు, సబ్సిడీలలో ప్రభుత్వ నిర్వహణకు, సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారు. రెవెన్యూ ఆదాయం రూ.88.891 కోట్లుగా ఉంది. ఇందులో సాంఘిక విభాగం కింద రూ.45వేల కోట్లు ఖర్చు చేశారు. అంతకుముందు ఏడాది కంటే ఈ ఖర్చు రూ.2వేల కోట్లు తగ్గింది.

ఖర్చులు ఎలా అంటే..
ఎనిమిది నెలల కాలంలో మూలధన వ్యయంపై రూ.4,737 కోట్లు ఖర్చు చేశారు. అంతకుముందు ఏడాది రూ.15 వేల కోట్లకు పైగా ఉంది. ఖర్చులో వేతనాలకు 2018-19 ఆర్థిక సంవత్సరం నవంబర్ నాటికి రూ.23,304 కోట్లు చెల్లిస్తే 2019-20లో నవంబర్ నాటికి రూ.23,496 కోట్లు చెల్లించారు. పెన్షన్స్ రూ.10,626 కోట్ల నుంచి రూ.11,414 కోట్లకు, సబ్సిడీలపై ఖర్చు రూ.4,131 కోట్ల నుంచి రూ.4,858 కోట్లకు, వడ్డీ చెల్లింపులకు రూ.9,656 కోట్ల నుంచి రూ.9,136 కోట్లకు పెరిగింది. ఈ ఆఱ్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.1,778 కోట్లకు పరిమితమవుతుందని బడ్జెట్ అంచనా వేసినప్పటికీ ఎనిమిది నెలల్లోనే ఇది రూ.25,141 కోట్లకు పైకి చేరుకుంది.

వసూళ్లు.. ఖర్చు
2018-19 నవంబర్ నాటికి రెవెన్యూ వసూళ్లు రూ.74,677 కోట్లుగా ఉంటే, ఈ సంవత్సరం నవంబర్ నాటికి రూ.63,750 కోట్లుకు తగ్గాయి. పెట్టుబడి వసూళ్లూ రూ.34 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్లకు పెరిగాయి. రెవెన్యూ ఖర్చు దాదాపు 92వేల కోట్ల నుంచి దాదాపు రూ.89వేల కోట్లకు తగ్గింది. పెట్టుబడి వ్యయం రూ.15,223 కోట్ల నుంచి రూ.4,737 కోట్లకు తగ్గింది. కాగా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఏపీలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని, జీతాలు, పెన్షన్లకే డబ్బులు లేవని మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించడం గమనార్హం.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications