ఆంధ్రప్రదేశ్ దేశ వ్యాప్తంగా మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే ఈ సారి ఆటోమేటివ్ రంగంలో సంచలనం సృష్టించింది. వాహనాలపై ఆసక్తి కేవలం కార్ల వరకే పరిమితం కాకుండా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల వరకు విస్తరించినట్టు ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. తాజాగా జరిగిన ఒక ప్రత్యేక వేలంలో ఏపీ వాసి వాహన రిజిస్ట్రేషన్ నంబర్ DDC 001 ను రూ. 2.08 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది దేశంలోనే ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా రికార్డు సృష్టించింది.
ఈ అరుదైన వేలం ప్రముఖ లగ్జరీ ఆటోమోటివ్ ప్లాట్‌ఫామ్ బిగ్ బాయ్ టాయ్జ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆక్షన్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ వేలం జరగగా.. మొదట ఈ ఈవెంట్‌పై ఆసక్తి ఉన్నప్పటికీ, త్వరలోనే అందరి దృష్టి DDC 001 నంబర్ చుట్టూ పడింది. ఒక సాధారణ నంబర్ ప్లేట్‌కు ఇంత భారీ ధర పలకడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ఈ "DDC 001" నంబర్ ప్లేట్ గతంలో బిగ్ బాయ్ టాయ్జ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ జతిన్ అహుజా పేరు మీద ఉంది. అయితే తాజా వేలం ప్రక్రియలో అనేక మంది సంపన్నులు ఆసక్తి చూపించినప్పటికీ, చివరికి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కిరణ్ కోల్పాకుల అత్యధికంగా రూ. 2.08 కోట్ల బిడ్ వేసి ఈ నంబర్‌ను దక్కించుకున్నారు. ఈ కొనుగోలుతో Kiran Kolpakula దేశవ్యాప్తంగా ఆటోమోటివ్ కలెక్టర్లలో ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఈ అమ్మకం కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, భారతదేశంలో ఫ్యాన్సీ, సింబాలిక్ నంబర్ ప్లేట్లకు ఉన్న డిమాండ్ ఎంతగా పెరిగిందో చూపించే ఉదాహరణగా నిలిచింది. బిగ్ బాయ్ టాయ్జ్ వ్యవస్థాపకుడు జతిన్ అహుజా మాట్లాడుతూ.. ఈ వేలానికి వచ్చిన స్పందన కార్లను మించిపోయే విలువ కలిగిన అరుదైన ఆస్తుల పట్ల కలెక్టర్లలో పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఇలాంటి లావాదేవీల్లో విశ్వసనీయత, ధృవీకరణ, పారదర్శకత అత్యంత కీలకమని, కొనుగోలుదారులు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
ఈ రూ. 2.08 కోట్ల ప్లేట్ అమ్మకం, గతంలో ఉన్న జాతీయ రికార్డును సులభంగా అధిగమించింది. ఇప్పటివరకు భారతదేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా గుర్తింపు పొందినది HR88B8888. ఇది గత ఏడాది నవంబర్‌లో జరిగిన అధికారిక వేలంలో రూ. 1.17 కోట్లకు అమ్ముడైంది. ఆ నంబర్ ప్లేట్ కూడా పునరావృత అంకెల కారణంగా విపరీతమైన బిడ్డింగ్‌ను ఆకర్షించింది.
దీనికంటే ముందు KL 07 DG 0007 నంబర్ ప్లేట్ రూ. 46 లక్షలకు అమ్ముడై అప్పట్లో రికార్డుగా నిలిచింది. ఈ నంబర్‌ను లిట్‌మస్7 వ్యవస్థాపకుడు వేణు గోపాలకృష్ణన్ తన ఖరీదైన లాంబోర్గిని ఉరుస్ పెర్ఫార్మాంటే కోసం కొనుగోలు చేశారు. ఆ సమయంలో నంబర్ ప్లేట్ ధర, కారు ధర మధ్య ఉన్న వ్యత్యాసం పెద్ద చర్చకు దారితీసింది.
బిగ్ బాయ్ టాయ్స్ ఆక్షన్ హౌస్ ఈ వేలాన్ని కేవలం అరుదైన నంబర్ ప్లేట్లకే పరిమితం చేయకుండా, ప్రముఖ సెలబ్రిటీలకు చెందిన లగ్జరీ కార్ల వరకు విస్తరించింది. ఈ వేలంలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి వాడిన మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి సొంతమైన మెర్సిడెస్-బెంజ్ CLA 200d, భారత క్రికెటర్ దినేష్ కార్తీక్‌కు చెందిన రేంజ్ రోవర్ స్పోర్ట్ SVR వంటి హైఎండ్ వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సెలబ్రిటీ యాజమాన్యంతో కూడిన ఈ కార్లు కలెక్టర్లు మరియు లగ్జరీ వాహనాల అభిమానులలో భారీ ఆసక్తిని రేకెత్తించాయి.
ఏదేమైనా "DDC 001" నంబర్ ప్లేట్ వేలం భారతదేశంలో లగ్జరీ, అరుదైన సేకరణల మార్కెట్ కొత్త స్థాయికి చేరుకున్నట్లు సూచిస్తోంది. ఇక ముందు కాలంలో ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు కూడా కార్లతో సమానంగా విలువైన ఆస్తులుగా పరిగణించబడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications