ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 2024 నుంచి 2025 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం ద్వారా రూ.8 వేల కోట్ల ఎక్సైజ్ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో ఇప్పటికే రూ.7,041 కోట్లు సాధించినట్లు ఎక్సైజ్ అధికారులు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడికి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు 4.5 శాతం పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3 శాతం వృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో శాఖ ముందుకు సాగుతోంది.
సచివాలయంలో నిర్వహించిన ఎక్సైజ్ శాఖ సమీక్షా సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి కీలక అంశాలను వివరించారు. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) అమ్మకాలు 19 శాతం పెరిగాయని, బీర్ అమ్మకాలు ఏకంగా 95 శాతం వృద్ధి సాధించాయని తెలిపారు. అంతర్జాతీయ బ్రాండ్ల మద్యం లభ్యత పెరగడం, ధరలు సరసంగా ఉండడం వల్ల దక్షిణ భారతదేశంలోనే అత్యధిక వృద్ధి రేటును ఆంధ్రప్రదేశ్ నమోదు చేసిందని అధికారులు పేర్కొన్నారు.

డిసెంబర్ 18 నుంచి 2026 మార్చి మధ్యకాలంలో మద్యం అమ్మకాల ద్వారా అదనంగా రూ.8,422 కోట్ల ఎక్సైజ్ ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది రాష్ట్ర ఖజానాకు గణనీయమైన ఊతం ఇవ్వనుందని అధికారులు వెల్లడించారు. మద్యం కొనుగోళ్లలో డిజిటల్ చెల్లింపులు 35 శాతం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని జిల్లాల్లో ఈ వృద్ధి 47 శాతం వరకు చేరిందని తెలిపారు. ఇది లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతోందని సూచిస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
మద్యం విధానం కేవలం ఆదాయాన్ని ఆర్జించడానికే పరిమితం కాకుండా, ఆరోగ్యకరమైన, నియంత్రిత వృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ప్రస్తుత మద్యం దుకాణాల కేటాయింపు వ్యవస్థలో మరింత మెరుగుదల అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. లాటరీ విధానం, దరఖాస్తు రుసుములు, మద్యం గుర్తింపు సంఖ్యలు, రిటైలర్ మార్జిన్ పెంపు వంటి అంశాలపై సమగ్రంగా కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు.
కల్తీ మద్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రతి మద్యం బాటిల్‌కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడీ) అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే మద్యం వ్యాపారంలో పారదర్శకత కోసం జియో-ట్యాగింగ్, ట్రాకింగ్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అక్రమ మద్యం విక్రయాలు జరిగే బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు హర్యానా రాష్ట్రంలోని సబ్-లీజు వ్యవస్థను అధ్యయనం చేయాలని అధికారులను కోరారు.
లిక్కర్ వినియోగం..దక్షిణాదిలో తెలంగాణ టాప్: దక్షిణ భారత రాష్ట్రాల మద్యం వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచినట్లు ఎక్సైజ్ శాఖ అంచనాలు వెల్లడించాయి. రాష్ట్రాల వారీగా ఒక ఏడాదిలో విక్రయమైన మొత్తం మద్యం పరిమాణాన్ని ఆయా రాష్ట్రాల జనాభాతో పోల్చి తలసరి మద్యం వినియోగాన్ని లెక్కించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ లెక్కల ప్రకారం, తెలంగాణలో సగటున ఒక్క వ్యక్తి సంవత్సరానికి 4.44 లీటర్ల ఆల్కహాల్ వినియోగిస్తున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. అక్కడ తలసరి మద్యం వినియోగం 4.25 లీటర్లుగా నమోదైంది.
తమిళనాడు మూడో స్థానంలో ఉంది. అక్కడ ఒక్క వ్యక్తి సంవత్సరానికి సగటున 3.38 లీటర్ల ఆల్కహాల్ వినియోగిస్తున్నట్లు అంచనా. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ 2.71 లీటర్లతో నాలుగో స్థానంలో నిలవగా, కేరళ 2.53 లీటర్ల తలసరి వినియోగంతో ఐదో స్థానంలో ఉంది.ఇక మద్యం వినియోగ పరిమాణంలోనే కాకుండా, ఖర్చు విషయంలోనూ తెలంగాణ ముందంజలో ఉందని ఎక్సైజ్ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో మద్యం కోసం ఒక వ్యక్తి సగటున ఏడాదికి రూ.11,351 వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కోసం సగటు వార్షిక ఖర్చు రూ.6,399గా నమోదైంది. ఇది తెలంగాణతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉండటం గమనార్హం.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications