పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థిక చరిత్రలోనే ఒక కీలక మైలురాయిని నమోదు చేసింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా ప్రకటించిన మొత్తం పెట్టుబడుల్లో ఏకంగా 25.3 శాతం వాటాను సొంతం చేసుకుని ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించినట్లుగా ఫోర్బ్స్ ఇండియా తన కథనంలో వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి ఏపీ ముందుకు రావడం దేశ పారిశ్రామిక గమనంలో పెద్ద మార్పును సూచిస్తోందని నివేదక తెలిపింది.
ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం రూ.26.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 11.5 శాతం అధికం. ఈ పెట్టుబడుల్లో సగానికి మించిన వాటా అంటే 51.2 శాతం కేవలం మూడు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమైంది. అందులో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా..ఒడిశా (13.1%), మహారాష్ట్ర (12.8%) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

ఈ అద్భుత విజయంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో ఆయన స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ఇక ఇతర రాష్ట్రాలను అందుకోవడం కాదు, వారిని దాటి ముందుకు దూసుకుపోతోంది. సంస్కరణల్లో స్థిరత్వం, నిర్ణయాల్లో వేగం, పెట్టుబడిదారులకు స్పష్టమైన భరోసా ఇవ్వడం వల్లే ఈ ఫలితం సాధ్యమైందని తెలిపారు. మాటలకే పరిమితం కాకుండా, విధానాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడిదారుల స్నేహపూర్వక పాలన, అనుమతుల ప్రక్రియలో వేగం, రంగాల వారీగా ప్రత్యేక విధానాలు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఓడరేవుల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్, విద్యుత్, డిజిటల్ మౌలిక వసతులపై ప్రభుత్వం పెట్టిన దృష్టి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత బలపరిచింది. తయారీ రంగం, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, మౌలిక వసతుల రంగాల్లో దేశీయంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులు భారీగా ఏపీ వైపు తరలివస్తున్నాయి. పెట్టుబడిదారులతో ప్రభుత్వం నిరంతరం నిర్వహిస్తున్న చర్చలు, స్పష్టమైన విధాన దిశ, పాలనలో పారదర్శకత ఈ ప్రవాహానికి బలమైన పునాదిగా నిలుస్తున్నాయి.
ఏదేమైనా వచ్చే ప్రతి పెట్టుబడి కేవలం గణాంకంగా కాకుండా, క్షేత్రస్థాయిలో ఫ్యాక్టరీలు, ఉద్యోగాలు, ప్రజలకు ఆదాయ అవకాశాలుగా మారాలి. దీర్ఘకాలిక భాగస్వామ్యాలు, యువతకు ఉపాధి కల్పన మా ప్రాధాన్యం అని నారా లోకేశ్ మరోసారి తెలిపారు.
More From GoodReturns

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications