ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమినీను రాష్ట్రానికి ఆహ్వానించటం విశేషంగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్.. క్యాప్‌జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఇజ్జత్ తో కీలక చర్చలు జరిపారు. భవిష్యత్తులో సుమారు 20 వేల మందికి ఉద్యోగాలను సృష్టించగల ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (GCC) విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లోకేశ్ ప్రతిపాదించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతలో.. విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ ఐటీ, డేటా సెంటర్ హబ్ గా అభివృద్ధి చెందుతోందని లోకేశ్ వివరించారు. ఈ ఏడాదిలో గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని.. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. భవిష్యత్తులో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడంతో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు. విశాఖలో ఏర్పడిన ప్రత్యేక ఐటీ ఎకోసిస్టమ్ ను సద్వినియోగం చేసుకోవాలని లోకేశ్ సూచించారు.

అంతేకాక రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో సహకరిస్తూ ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై ల్యాబ్‌లు ఏర్పాటు చేయడానికి కో-డెవలప్‌మెంట్ పార్టనర్ గా Capgemini వ్యవహరించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. అలాగే, ఏపీలో క్వాంటం వ్యాలీ అభివృద్ధి, డెడికేటెడ్ క్వాంటం వర్టికల్ స్థాపనకు సహకారం అందించాలని కోరారు.
మంత్రి లోకేశ్ ప్రతిపాదనలపై క్యాప్‌జెమినీ CEO ఐమాన్ ఇజ్జత్ సానుకూలంగా స్పందించారు. ఫ్రాన్స్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే తమ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 3.4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, వారిలో 2 లక్షల మంది భారత్‌లోని 13 నగరాల్లో పని చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో క్యాప్‌జెమినీ ఇండియా CEO సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ CEO కేశవ్ మురుగేశ్ కూడా పాల్గొన్నారు.
క్యాప్‌జెమినీ సంస్థ వార్షిక ఆదాయం సుమారు 23.9 బిలియన్ డాలర్లుగా ఉన్నందున, విశాఖపట్నంలో IT & GCC కేంద్రాల ఏర్పాటు ఏపీ రాష్ట్రంలో పెట్టుబడి, ఉద్యోగం, ఆర్థిక వృద్ధికి గొప్ప తోడ్పాటు అవుతుంది. ఈ చర్చల ద్వారా విశాఖపట్నం దేశంలో అత్యాధునిక IT హబ్ గా, ఎమర్జింగ్ టెక్నాలజీస్ కేంద్రంగా ఎదగడానికి పునాది పడుతుంది. ఐటీ, డేటా, గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాల ఏర్పాటు రాష్ట్రంలో విశాఖపట్నం ఆర్థిక, ఉపాధి, పెట్టుబడి వృద్ధికి దోహదం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications