ఏపీలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేసే యోచనలో Accenture .. 12 వేల ఉద్యోగాలు..
టెక్ కన్సల్టెన్సీ దిగ్గజం Accenture ఆంధ్రప్రదేశ్‌లో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లుగా వార్దలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదన ద్వారా కంపెనీ భారతదేశంలో దాదాపు 12 వేల కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి లక్ష్యంగా పెట్టుకుందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఇది రాష్ట్రానికి పెద్ద ఆర్థిక మరియు ఉపాధి లాభాలను తెస్తుందని ఆ నివేదికలో పేర్కొంది.
Accenture విశాఖపట్నం ఓడరేవు ప్రాంతంలో దాదాపు 10 ఎకరాల భూమి కావాలని ఏపీ ప్రభుత్వాన్ని అడిగినట్లుగా రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.ఇది ప్రైవేట్ విషయం కాబట్టి పేరు వెల్లడించకూడదని అభ్యర్థిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపినట్లుగా రాయిటర్స్ న్యూస్ తెలిపింది. అయితే దీనిపై క్లారిటీ తీసుకునేందుకు రాయిటర్స్ చేసిన అభ్యర్థనకు యాక్సెంచర్ ఇంకా స్పందించలేదు.

Accenture ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద ఐటీ దిగ్గజంగా ఉంది. దాని 790,000 మంది ఉద్యోగులలో 300,000 మందికి పైగా భారతదేశంలోనే పనిచేస్తున్నారు. కొత్త క్యాంపస్ ప్రారంభం అయిన తర్వాత, ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఇండియాలోని టియర్-2 నగరాలలో క్యాంపస్‌లు ఏర్పాటు చేయడం ఇప్పుడు మరింత పాపులర్ అవుతోంది.కాగా TCS, Cognizant వంటి కంపెనీలు కూడా విశాఖపట్నంలో భారీ క్యాంపస్‌లు నిర్మించాయి. ఉదాహరణకు, Cognizant 183 మిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది, TCS దాని సౌకర్యాల కోసం 154 మిలియన్ల డాలర్లకు పైగా ఖర్చు పెట్టింది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా Accentureని ఆంధ్రప్రదేశ్‌లోకి తీసుకురావడానికి ఆసక్తి చూపుతోంది. ఈ ప్రతిపాదన సమీక్షలో ఉంది, ఆమోదం త్వరలో పొందే అవకాశం ఉందని రాష్ట్ర అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఉద్యోగ సృష్టి, IT రంగ అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications