బెంగళూరు నగరంలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ప్రతిపాదిత ఏరోస్పేస్ పార్క్ కోసం దేవనహళ్లి తాలూకాలో 1,777 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించే ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం విరమించుకున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న ప్రకటించారు. ఇది రైతుల ఉద్యమానికి పెద్ద విజయం అని తెలిపారు.దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఇవ్వకుంటే మేము ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం.. ఆంధ్రప్రదేశ్ ఏరోస్పేస్ భూమిని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఎక్స్ వేదికగా తెలిపారు.
ఏరోస్పేస్ పార్క్ కోసం భూసేకరణను నిలిపివేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకున్న చర్యకు ప్రతిస్పందనగా.. మంత్రి Nara Lokesh సోషల్ మీడియా Xలో ఏరోస్పేస్ పరిశ్రమను మా రాష్ట్రానికి తరలించండి.. స్థలం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. డియర్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ..మీకు ఏరోస్పేస్ పార్క్ కోసం రిక్వెస్ట్ చేసిన భూసేకరణను నిలిపివేయాలనే చర్య గురించి విని నేను బాధపడ్డాను. అయితే మీ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మా దగ్గర మరో మంచి ఎంపిక ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోరు. బెంగళూరుకు దగ్గరగా 8000 ఎకరాల భూమి, అద్భుతమైన ప్రోత్సాహక ప్యాకేజీలతో మీ కోసం మా వద్ద ప్రో-యాక్టివ్ ఏరోస్పేస్ విధానం రెడీగా ఉంది. దీనిపై చర్చించడానికి త్వరలో మిమ్మల్ని కలవాలని ఎదురుచూస్తున్నానంటే ఎక్స్ లో పోస్ట్ చేశారు.
నిన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లిలో 1,777 ఎకరాల వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకునేందుకు తుది నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. దీనిపై సిద్ధరామయ్య మాట్లాడుతూ, "ఆ భూమి బెంగళూరు సమీపంలో ఉంది. దీనిని వ్యవసాయానికి చురుగ్గా ఉపయోగిస్తున్నారు. ఇది చాలా మంది రైతుల జీవనోపాధికి ఆధారం. అందుకే మేము ఈ సముపార్జనను విరమించుకోవాలని నిర్ణయించుకున్నామని అన్నారు.
ముఖ్యంగా విమానాశ్రయం సమీపంలోని గ్రీన్ బెల్ట్‌లో భూమి ఉన్నందున, దానిని స్వాధీనం చేసుకోవద్దని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వారు నిరసనలు కూడా నిర్వహించారు.ఈ నిరసనతో ప్రభుత్వం ప్రాజెక్టును ఉపసంహరిస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ భూసేకరణ జరిగింది. అయితే రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఉపసంహరించుకుంటున్నారం.. వారికి మేము తగిన పరిహారం అందిస్తాము. యజమానులు దానిని పంచుకోవడానికి ఇష్టపడని ఏ భూమినైనా మేము మినహాయిస్తామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
దేవనహళ్లి ప్రాంతంలోని రైతులు, వివిధ సంఘాలు సహా, నిరసన నిర్వహించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం రైతులకు తలొగ్గి ప్రతిపాదన విరమించుకుంది. నటుడు ప్రకాష్ రాజ్ సహా అనేక మంది నాయకులు ఈ నిరసనకు మద్దతు ఇచ్చారు. నారా లోకేష్ ట్వీట్‌పై బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య స్పందిస్తూ, కర్ణాటక ప్రభుత్వం నారా లోకేష్ నుండి నేర్చుకుని వ్యాపారాలను ఆకర్షించడం, పరిశ్రమలను స్వాగతించడం మరియు ఉద్యోగాలను సృష్టించడం వంటి వాటిపై తన మార్గాన్ని సరిదిద్దుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications