ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఒక కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఐబీఎం భాగస్వామ్యంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ' ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సోమవారం దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టుతో రాజధాని ప్రాంతంలో అత్యాధునిక సాంకేతికతకు బీజం పడనుంది.
ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం IBM (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్) ప్రతిపాదించిన 133-క్విట్, 5,000-గేట్ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. ఈ కంప్యూటర్‌ను అమరావతి Quantum కంప్యూటింగ్ సెంటర్ (AQCC) లో ఏర్పాటు చేయనున్నారు. డీప్ టెక్నాలజీలు, క్వాంటం అప్లికేషన్లు, తదితర రంగాల్లో అత్యాధునిక పరిశోధనకు ఊతమిచ్చే ఈ కేంద్రం.. విశ్వవిద్యాలయాలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు అన్నింటికీ మేలుచేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

క్వాంటం వ్యాలీగా అమరావతిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) ఇప్పటికే 50 ఎకరాలను కేటాయించింది. ఐటీ కార్యదర్శి భాస్కర్ కాటమ్ నేని తెలిపిన వివరాల ప్రకారం, ఈ క్వాంటం కంప్యూటర్‌ను 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. అధునాతన శీతలీకరణ, నిరంతర విద్యుత్ సరఫరా, సురక్షిత నెట్‌వర్కింగ్ వ్యవస్థలు అన్నీ ఈ సెంటర్‌లో అందుబాటులో ఉంటాయి.
IBM తొలుత ప్రభుత్వ విద్యా సంస్థలకు సబ్సిడీ ధరలతో అద్దె (రూ. 10 ప్రతి చదరపు అడుగుకు), సంవత్సరానికి 250 గంటల ఉచిత కంప్యూటింగ్ సమయం ఇవ్వాలని ప్రతిపాదించింది. అయితేAQCC బోర్డు దీనిని పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అద్దెను చదరపు అడుగుకు రూ. 30 లెక్కన నిర్ణయించింది. అదే సమయంలో ఉచిత కంప్యూటింగ్ సేవల గంటలను 365 గంటలకు పెంచింది. తద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నాలుగేళ్ల పాటు ఏటా 365 గంటల ఉచిత ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి రానున్నాయి.
సూపర్ కంప్యూటింగ్ సౌకర్యం నాలుగు సంవత్సరాలపాటు IBMతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాలంలో విద్యుత్, శీతలీకరణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. దీంతో క్వాంటం కంప్యూటర్ నిరంతరాయంగా పనిచేస్తూ పరిశోధన, అభివృద్ధికి సహకరిస్తుందని అధికారులు పేర్కొన్నారు.కాగా ఈ ప్రతిపాదనను ఆగస్టు 20న ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్వాంటం మిషన్ సమావేశంలో AQCC బోర్డు ఆమోదించింది. ఈ నిర్ణయం ద్వారా అమరావతి.. దేశవ్యాప్తంగా క్వాంటం కంప్యూటింగ్ రంగంలో ముందంజలో నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతి భారతదేశంలోనే మొదటి క్వాంటం పరిశోధన కేంద్రం గా నిలవనుంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా అధునాతన పరిశోధన చేసుకునే అవకాశం పొందుతాయి.క్వాంటం కంప్యూటింగ్ అప్లికేషన్లను అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురావొచ్చు.తమ ఆపరేషన్లలో క్వాంటం ఆధారిత సొల్యూషన్‌లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఆచరణలోకి వస్తే.. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications