Andhra Pradesh: ఏపీలోని జగన్ ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. పేద విద్యార్థులు సైతం కార్పొరేట్ స్థాయి విద్యను పొందాలనే తపనతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారని మాజీ విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఎమ్మెల్యే అన్నారు. మానవ వనరుల అభివృద్ది కేవలం రాష్ట్రానికే కాక దేశానికి సైతం ఉపయోగకరమని పార్థసారథి అన్నారు. ప్రజలు దీనిని గమనించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ ప్రభుత్వంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

జగన్ సర్కార్ రాష్ట్రంలోని విద్యావ్యవస్థను సమూలంగా మార్పు చేస్తున్న తరుణంలో ఇందుకోసం రూ.30,000 కోట్లను కేటాయించింది. ఇందులో భాగంగా బైజూస్ యాప్ ద్వారా విద్యార్థులకు కోట్ల రూపాయలు విలువైన కంటెంట్ ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం విదేశీ విద్య కోసం భారీగా సాయం అందిస్తోంది. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని కొలుసు పార్థసారధి పేర్కొన్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి జగన్ 'విదేశీ విద్యా దీవెన' పథకం కింద ఏకంగా 213 మందికి దాదాపు రూ.20 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ దీనిని అందిస్తోంది. ఈ క్రమంలో ఒక టీడీపీ సర్పంచ్ కుమార్తెకు రూ.84 లక్షల సాయం అందింది. మెుదటి విడత కింద ఆమె ఖాతాలో ప్రభుత్వం రూ.13,99,154ను జమచేసింది.

'జగనన్న విద్యా కానుక' కింద ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండే విద్యార్థులకు మూడు జతల యూనిఫారాలు, నోట్‌బుక్‌లు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌లు, బెల్ట్, స్కూల్ బ్యాగ్‌లను అందజేస్తూ రికార్డు సృష్టించింది. దేశంలో ఏరాష్ట్రంలోనూ ఇలాంటి సదుపాయ లేదు. దీనికి తోడు నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించి పాఠశాలలను పునర్నిర్మాణం చేశారు. మెుత్తంగా విద్యాకానుక ద్వారా 40 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరిగింది. దీనికోసం మూడేళ్లుగా ప్రభుత్వం రూ.2,368.33 కోట్లను ఖర్చు చేసింది.

ప్రభుత్వ పాఠశాల్లలోని విద్యార్థులకు డిజిటల్ విద్యను ప్రభుత్వం చేరువ చేసింది. దీంతో విద్యార్థుల హాజరు సైతం 61-72 శాతం పెరిగింది. ఏపీలోని విద్యా విధానంలో తెచ్చిన సమూల మార్పులను ప్రపంచ దేశాల నిపుణులు సైతం ప్రశంశించటం గమనార్హం. నాడు-నేడు పేరును PM SHRI (PM స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా)గా మార్చారు. ఇలాంటి అనేక మార్పులను తీసుకురావటంతో దేశంలో ఏపీ 7వ స్థానంలో ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications