Andhra Pradesh: ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి.. తలసరి ఆదాయంలో వృద్ధి..
Andhra Economy: ఆంధ్రప్రదేశ్ గడచిన 5 సంవత్సరాల్లో అద్భుతమైన పురోగతిని నమోదు చేసింది. 2014లో తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఏపీ తన ఆదాయవనరుగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని వదులుకోవాల్సి వచ్చింది. రాత్రికి రాత్రి విభజనతో టెక్ ఆదాయాన్ని భారీగా ఏపీ కోల్పోయింది. దీంతో ఆర్థిక పరంగా రాష్ట్రం పెద్ద అన్యాయానికి గురైంది.
2014లో జరిగిన విభజనతో ఆంధ్రప్రదేశ్ సర్వీస్ సెక్టార్ చాలా బలహీనమైంది. అలాగే రాష్ట్రం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలతో వ్యవసాయ ఆధారిత ఆదాయంపై ఆధారపడాల్సి వచ్చింది. వాస్తవానికి ఈ పరిస్థితులకు కారణం టెక్ రంగాన్ని అధికంగా హైదరాబాద్ కేంద్రంగానే గత నాయకులు అభివృద్ధి చేయటం.. చివరికి అది రాష్ట్ర ఆదాయానికి తోడ్పడకుండా పొరుగున ఉన్న తెలంగాణకు వెళ్లటం పూడ్చలేని ఆర్థిక లోటును ఏపీకి మిగిల్చింది.

ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజల సగటు ఆదాయం తగ్గుదలకు దారితీసిది. దీనికి తోడు మెుత్తం మీద ఎకానమీ కుచించుకుపోయింది. ఆదాయ వనరులు తగ్గటంతో పాటు అప్పుల బాధ్యతలు పెరగటం రాష్ట్రానికి పెద్ద భారంగా మారింది. అయితే ఇక్కడ ఏపీ అసలైన పురోభివృద్ధికి బాటలు పడ్డాయి. అనేక రంగాల్లో రాష్ట్రం గడచిన 5 ఏళ్ల కాలంలో రెండంకెల వృద్ధితో వేగంగా వృద్ధి చెందుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ క్రమంలో సగటు తలసరి ఆదాయం 2017-18కి 1680 డాలర్ల నుంచి 2022-23 నాటికి 2670 డాలర్లకు చేరుకుంది. అంటే గత ప్రభుత్వ హయాంలో ఆదాయం 1000 డాలర్ల మేర పెరుగుదలను నమోదు చేసిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఏపీ టాక్స్ ఆదాయం 2020-21 సంవత్సరంలో 7.3 బిలియన్ డాలర్ల నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరానికి 10 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. ఈ క్రమంలో బలమైన వ్యవసాయ, తీరప్రాంత ఆధారిత రంగాల్లో బలమైన వృద్ధి రాష్ట్రానికి కొత్త ఆర్థిక వనరులుగా, ఏపీ ఎకానమీకి బలమైన స్థంబాలుగా మారాయి. గత ప్రభుత్వ పనితీరుతో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు, ఎమ్ఎస్ఎమ్ఈ రంగంలో అభివృద్ధి కొనసాగుతోంది. ఇదే క్రమంలో కొత్తగా బ్లూ ఎకానమీకి ప్రభుత్వం వేసిన పునాదులు పడటం ఆంధ్ర ప్రదేశ్ కొత్త గ్రోత్ ఇంజన్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications