YS Jagan: రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక విషయాలపై విన్నవించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన చేశారు. ఈ క్రమంలో నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన నిధులు, అభివృద్ధికి సంబంధించిన విషయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని సీఎం జగన్ ఆర్థిక మంత్రిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగానే అప్పులు చేస్తోందని అయినా ఆంక్షలు పెట్టడంపై విన్నవించారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి.. తర్వాతి కాలంలో దానిని రూ.17,923 కోట్లుకు తగ్గించిన విషయాన్ని నిర్మలమ్మ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని కోరారు.

తెలంగాణ డిస్కంల నుంచి 2014-2017 మధ్య కాలంలో విద్యుత్ సరఫరాకు చెందిన రూ.7,058 కోట్ల బకాయిలను ఇప్పించాలని కోరారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.36,625 కోట్ల రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ వెంటనే విడుదల చేయాలని సీఎం జగన్ విన్నవించారు.
పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలంటూ విజ్ఞప్తి చేశారు. డయాఫ్రంవాల్ ప్రాంతంలో అవసరమైన మరమ్మతులకు రూ.2,020 కోట్లు అవసరం ఉన్నందున ఆ నిధులను విడుదల చేసి పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లటానికి సహకరించాలని కోరారు.
ఏపీ జీవనాడి పోలవరాన్ని పూర్తిచేసేందుకు రాష్ట్రం ఖర్చుచేసిన రూ.2,600.74 కోట్ల సొంత నిధులను రీయింబర్స్ చేయాలని కోరారు. దీనికి తోడు పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ.55,548 కోట్లుగా నిర్థారించిందని.. దానికి కేంద్రం ఆమోదం తెలపాలని కోరారు. చివరిగా ఎప్పటి నుంచో అడుగుతున్న ప్రత్యేక హోదా అంశాన్ని ఆర్థిక మంత్రి వద్ద ప్రస్తావిస్తూ.. పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications