ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్రంలోని NDA సర్కారులో కీలక మిత్రుడైన నారా చంద్రబాబు, భారతీయ రక్షణ తయారీ రంగాన్ని.. రాష్ట్రానికి ఆకర్షించేందుకు ప్రణాళికలతో కూడిన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంస్థ అభివృద్ధి చేస్తున్న Advanced Medium Combat Aircraft (AMCA), Light Combat Aircraft (LCA) తయారీ ఉత్పత్తిని కాంగ్రెస్ పాలిత రాష్ర్టం అయిన కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని కేంద్రానికి ప్రతిపాదించారు.
ఏపీలో రక్షణ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కోసం కేంద్రంలోని మంత్రులతో కీలక చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా లేపాక్షి, దొనకొండ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతిలో భారత రక్షణ హబ్‌లను అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం సూచించారు. ఈ ప్రతిపాదన ద్వారా ఏపీ..భారత రక్షణ తయారీకి కేంద్రంగా మారుతుందని సీఎం చంద్రబాబు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలో ఏపీ సీఎం చంద్రబాబు కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు.అవేంటంటే..

1. AMCA కారిడార్
లేపాక్షి-మడకసిర హబ్‌లో AMCA (Advanced Medium Combat Aircraft) తయారీ ఉత్పత్తి సౌకర్యం కోసం 10,000 ఎకరాల భూమిని సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రులకు తెలిపారు. ఈ ఏరియా నుంచి బెంగళూరు విమానాశ్రయానికి ఒక గంటలోనే చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే AMCA ఉత్పత్తికి HALకి అవసరమైన భూమిని అందించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు నాయుడు పేర్కొన్నారు.
AMCA భారతదేశంలోని ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్. HAL ఇతర ప్రైవేట్ సంస్థలతో కలిసి దీనిని అభివృద్ధి చేసి తయారు చేస్తోంది. చంద్రబాబు ప్రతిపాదించిన వాటిల్లో అదే అతి పెద్ద హబ్ గా ఉంది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు తర్వాత భారతదేశంలో మూడవదిగా దీనిని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉత్తరం నుండి దక్షిణం వరకు 23,000 ఎకరాల భూమిలో ఈ కారిడార్ విస్తరించి ఉంది. ముఖ్యమంత్రి శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చలో భాగంగా సీఎం చంద్రబాబు ఈ కారిడార్‌లో ఐదు హబ్‌లను ప్రతిపాదించారు.
2. Donakonda IAF స్టేషన్ (6,000 ఎకరాలు) : రక్షణ పారిశ్రామిక కారిడార్‌లో అతిపెద్ద హబ్‌కోసం జగ్గియాపేట-డొనకొండ హబ్‌లో ఆరు వేల ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతంలో ఆపరేషనల్ ఎయిర్ బేస్, లాజిస్టిక్స్ సెంటర్, శిక్షణ సౌకర్యం, మరియు ఆర్&డీ హబ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు సీఎం చంద్రబాబు . ఇందులో IAF కోసం ఆపరేషనల్ ఎయిర్ బేస్, లాజిస్టిక్స్ సెంటర్, శిక్షణ సౌకర్యం, పరిశోధన, అభివృద్ధి హబ్‌ను చంద్రబాబు ప్రతిపాదించారు.
3. Visakhapatnam-Anakapalli Naval Hub (3,000 ఎకరాలు)
3,000 ఎకరాలకు పైగా ప్రతిపాదించబడిన విశాఖపట్నం-అనకాపల్లి హబ్‌ను నావల్ ఎక్విప్‌మెంట్, వెపన్స్ టెస్టింగ్ ఫెసిలిటీ కోసం అందిస్తున్నారు. తూర్పు నావల్ కమాండ్ మరియు నేషనల్ అడ్వాన్స్‌డ్ ఆఫ్‌షోర్ బేస్‌కు మద్దతుగా సముద్రతీర భూభాగాన్ని మెరైన్, అండర్ వాటర్ సెజ్‌గా ప్రకటించాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. 2026-27 నాటికి ₹2.5 ట్రిలియన్ల ఆర్డర్‌లను ఆశిస్తున్న HAL, LCA, లైట్ కాంబాట్ హెలికాప్టర్‌ల ఉత్పత్తిని విస్తరిస్తోందని, HAL విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేయడానికి మౌలిక సదుపాయాలను సులభతరం చేయడానికి ఏపీ ఆసక్తిగా ఉందని చంద్రబాబు తెలిపారు.
4. Kurnool-Orvakal Drone & Defence Hub (4,000 ఎకరాలు)
కర్నూలు-ఓర్వకల్ వద్ద మిలిటరీ డ్రోన్, రోబోటిక్స్, అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ కాంపోనెంట్ తయారీకి నాల్గవ హబ్‌ను సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. ఇది 4,000 ఎకరాలలో విస్తరించి ఉంటుంది.
5. Tirupati R&D Hub
తిరుపతిలో భారత రక్షణ ఆవిష్కరణలలో పరిశోధన, అభివృద్ధి కోసం ఐదవ హబ్ ప్రతిపాదించబడింది.
ఐదు హబ్‌ల ప్రధాన ఉద్దేశం:
దేశీయంగా రక్షణ ఏరోస్పేస్ ఉత్పత్తిని ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేమని చంద్రబాబు తెలిపారు. అలాగే దిగుమతులపై ఆధారపడటం కూడా తగ్గించవచ్చని అలాగే ఎగుమతులు పెంచవచ్చని సీఎం తెలిపారు. HAL కోసం పెద్ద స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి, 2026-27 నాటికి ఆశించిన ₹2.5 లక్షల కోట్ల ఆర్డర్లను సమర్థవంతంగా అమలు చేయడంలో సహకరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
రక్షణ పారిశ్రామిక కారిడార్లు ఇప్పటికే ఉన్న రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థలను ఉపయోగించుకుంటాయి. ప్రైవేట్ పెట్టుబడుల సాయంతో దానిపై మరింత నిర్మించబడతాయి. ఈ కారిడార్లు రక్షణ, అంతరిక్ష సంబంధిత వస్తువుల స్వదేశీ ఉత్పత్తిని ఉత్ప్రేరకపరుస్తాయనిపెంచుతాయని భావిస్తున్నారు. దేశ రాజధానికి రెండు రోజుల పర్యటనలో చంద్రబాబు నాయుడు హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్‌లను కలిశారు.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications