ఏపీని భవిష్యత్ సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుపతిలో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ' (AP FIRST) పేరుతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో పరిశోధన, ఆవిష్కరణలకు కొత్త దిశ చూపే ఈ ప్రాజెక్టును తిరుపతిని కేంద్రంగా రూపొందించనున్నారు.
తన క్యాంప్ కార్యాలయంలో ఏరోస్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగాల సలహాదారులతో పాటు డ్రోన్ కార్పొరేషన్ సీనియర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం అధికారికంగా AP FIRST ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తిరుపతిలో ఇప్పటికే ఉన్న ఉన్నత విద్యా, పరిశోధనా సంస్థల సమన్వయంతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు.

AP FIRST పరిశోధనా కేంద్రం ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్, అంతరిక్ష సాంకేతికత, కృత్రిమ మేధస్సు (AI), సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ, హెల్త్‌కేర్, బయోటెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, గ్రామీణ సాంకేతికత వంటి కీలక రంగాలపై పరిశోధన జరగనుంది. భవిష్యత్తులో వేగంగా అభివృద్ధి చెందనున్న రంగాలను ముందుగానే గుర్తించి, యువతను అవసరమైన నైపుణ్యాలతో సిద్ధం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలో డ్రోన్ వినియోగాన్ని విస్తృతంగా పెంచే అంశాలపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. డ్రోన్ టాక్సీలు, డ్రోన్ అంబులెన్స్‌లు, ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థల్లో డ్రోన్ల వినియోగం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
ఇక పర్యావరణ హిత ఇంధన రంగంలో కూడా Andhra Pradesh మరో చారిత్రాత్మక ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. కాకినాడలో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దీనికి సుమారు రూ.18 వేల కోట్ల (2 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాలకు గ్రీన్ అమ్మోనియాను ఎగుమతి చేయనున్నారు. జర్మనీకి చెందిన యూనిపర్ సంస్థకు ప్రధానంగా ఎగుమతులు జరగనున్నాయి. మలేసియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్‌లోని జీఐసీ, యూఏఈకి చెందిన ఏడీఏఐ సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
కాకినాడలో ఏర్పాటయ్యే ఈ గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ ద్వారా ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయనున్నారు. 1,950 మెగావాట్ల సామర్థ్యం గల ఎలక్ట్రోలైజర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. 2028 నాటికి 0.5 ఎంఎంటీపీఏ, 2030 నాటికి 1.5 ఎంఎంటీపీఏ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించారు. 495 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో సుమారు 8,000 మందికి ఉపాధి కల్పించనుంది. నిర్మాణం పూర్తయ్యాక లాజిస్టిక్స్, నిల్వలు, పోర్టు సేవల ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications