ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం పొగాకు బోర్డు ద్వారా రూ.150 కోట్లు కేటాయించేలా చూడాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు తదితర అంశాలపై కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 300 కోట్లు ఖర్చు చేసి దాదాపు 20 మిలియన్ కిలోల బర్లీ పొగాకును కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
అయితే వ్యాపారులు పొగాకు నిల్వలను తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారని సీఎం తెలిపారు. రైతుల బాగు కోసం కోసం బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని 7 ప్రాంతాలలో టుబాకో కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసే రూ.300 కోట్లలో టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలని సీఎం కోరారు.

అమెరికాతో చర్చలు జరపండి: ఆక్వా ఎగుమతులపై విధించిన సుంకాలకు సంబంధించి అమెరికాతో చర్చలు జరపాలని కేంద్ర మంత్రికి సీఎం సూచించారు.అమెరికా సముద్రపు ఆహార ఉత్పత్తులపై విధించిన 27% సుంకం ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావం చూపుతోంది. ఆక్వా రైతుల నుండి ఉపశమనం పొందేందుకు కేంద్రం అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలి" అని చంద్రబాబు డిమాండ్ చేశారు. మామిడి గుజ్జుపై జీఎస్టీని 12% నుండి 5%కి తగ్గించాలని కూడా గోయల్‌ను కోరారు.
ఆయిల్ పామ్ పై దిగుమతి సుంకం తగ్గించాలి : రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్యను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసువెళ్లిందని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. ఆయిల్ పామ్ పై దిగుమతి సుంకాన్ని 10% కు తగ్గించే విషయాన్ని పునరాలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్రమంత్రి గోయల్ ను కోరారు. దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల రాష్ట్రంలోని పామ్ ఆయిల్ రైతులు తక్కువ ధరలతో భారీ నష్టాలను చవిచూస్తున్నారని సీఎం వివరించారు.
పొగాకు రైతులు అధికంగా ఉత్పత్తి చేయడంవల్లే : ఆదివారం గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయానికి వచ్చిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్..కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌తో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పియూష్ గోయెల్ మాట్లాడుతూ.. పొగాకు రైతులు అధికంగా ఉత్పత్తి చేయడంవల్లే అంతర్జాతీయ మార్కెట్‌లో దానికి డిమాండ్ తగ్గిందని.. అందుకే వారు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పరిమితికి మించి పొగాకు సాగు చెయ్యొద్దని.. ఉత్పత్తి లక్ష్యం తగ్గించేలా రైతుల్లో చైతన్యం కలిగించాలని బోర్డు అధికారులు, సిబ్బందికి సూచించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. రాష్ట్రంలో అనుమతించిన విస్తీర్ణంలోనే పొగాకు సాగు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదేశించారు.
అదనపు విస్తీర్ణంలో పొగాకు సాగు చేయకూడదు: గత నాలుగేళ్లలో పొగాకు రైతుల ఆదాయం పెరిగిందన్నారు. అది అలానే కొనసాగాలంటే అదనపు విస్తీర్ణంలో పొగాకు సాగు చేయకూడదని తెలిపారు. ఈ విషయంలో బోర్డు పరంగా అవసరమైన చర్యలు తీసుకొంటామన్నారు. పొగాకు రైతులకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలను బోర్డు ఇస్తోంది.
ఏటా రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలను రైతుల పిల్లల చదువుల కోసం మంజూరు చేస్తోంది. తీసుకొన్న రుణాలను ఐదేళ్లలోపు చెల్లించే విధంగా నిబంధనలను సడలించాం. పొగాకు రైతుల పిల్లలకు స్కిల్ డెవల్‌పమెంట్ శిక్షణతో పాటు జర్మనీ, జపాన్ భాషల్లో కూడా శిక్షణ ఇస్తున్నాం. దీని వల్ల ఆయా దేశాల్లో ఉద్యోగాల సాధనకు ఆస్కారం ఉంటుందని కేంద్ర మంత్రి వివరించారు.
ఏపీలో మూడు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏపీలో మూడు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ వెల్లడించారు. పోర్టులు, పారిశ్రామికాభివృద్ధి ద్వారా రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందుతాయని అందుకే..ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
మౌలిక వసతులు, పర్యాటకం, ఏరో స్పేస్, కెమికల్స్ తదితర రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుదల సాధనపై సీఎం చంద్రబాబుతో చర్చించామని కేంద్రమంత్రి తెలిపారు. కృష్ణపట్నం పార్కు వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో... రాబోయే రోజుల్లో వేలాది మందికి కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పీయూష్ గోయల్ అన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications