Chandrababu: రూ.500 నోట్లు రద్దు చేయాలి.. సీఎం చంద్రబాబు డిమాండ్..!
కరెన్సీ నోట్లకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోనే కాదు.. సమాజంలోనూ అవినీతి పోవాలంటే.. అవినీతి కంట్రోల్ కావాలంటే 500 రూపాయల నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి నిర్మూలనకు పెద్ద నోట్ల రద్దు ఓ మార్గమని ఆయన చెప్పారు..ఇప్పుడు మార్కెట్ లో ఉన్న 500 రూపాయల నోట్లు రద్దు చేసినట్లయితే అవినీతి తగ్గిపోతుందన్నారు సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. నోట్ల స్థానంలో డిజిటల్ కరెన్సీని ఉత్తమమైన మార్గమని పేర్కన్నారు. ప్రతి ఒక్కరూ డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పెద్ద నోట్లు అంటే 100, 200 రూపాయల నోట్లు మాత్రమే ఉండాలని.. అంతకు మించి ఉండాల్సిన అవసరం లేదన్నారు. గతంలో 2 వేలు, వెయ్యి నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశానని.. అందుకు తగ్గట్టుగానే ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం 2 వేలు, వెయ్యి నోట్లను రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా 500 నోట్ల రూపాయలను రద్దు చేసినట్లయితే అవినీతి తగ్గుతుందని చెప్పారు. ప్రజలు అందరూ డిజిటల్ కరెన్సీని వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. అప్పుడే అవినీతి తగ్గుతుందన్నారు. రాబోయే రోజుల్లో అవినీతిపై యుద్ధం చేస్తామని ప్రకటించారు. ఆ దిశగా నోట్ల విషయంలోనూ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ప్రజలు తమ వద్ద ఉన్న పాత రూ.1000, రూ.500 నోట్లను మార్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే రూ.2000 నోట్లు, రూ.200 నోట్లను తీసుకొచ్చారు. కొద్ది సంవత్సరాల తర్వాత రూ.2000 నోట్లను కూడా నిలిపివేశారు. ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని ఆర్బీఐ సూచించింది. ప్రజల వద్ద రూ.2000 నోట్లు దాదాపుగా బ్యాంకుల వద్దకు వెళ్లిపోయాయి. ఇప్పుడు రూ.1000 కొత్త నోట్లు వస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఇప్పటికే ట్వీట్ చేసింది. కొత్త రూ.1,000 నోటు విడుదలైందంటూ జరుగుతున్న ప్రచారం సరైంది కాదని స్పష్టం చేసింది. తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. రూ.500 నోట్లు కూడా రద్దు చేస్తే బెటరే అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం లంచాలు తీసుకునే వారు రూ.500 నోట్లు తీసుకుంటారని.. వాటిని రద్దు చేయడం వల్ల అవినీతి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications