Andhra Pradesh: జనాభా పెంచేందుకు ఏపీ ప్రభుత్వం క్రేజీ ప్లాన్.. ఎక్కువ మంది పిల్లలుంటే క్యాష్ ప్రైజ్!

ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) లో జనాభా తగ్గుదల రేటును అరికట్టేందుకు, భవిష్యత్తు మానవ వనరులను కాపాడుకునేందుకు కూటమి ప్రభుత్వం ఒక వినూత్నమైన నిర్ణయాన్ని ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇకపై మూడో బిడ్డ జన్మిస్తే రూ. 30,000, నాలుగో బిడ్డ జన్మిస్తే రూ. 40,000 చొప్పున ఒకేసారి నగదు ప్రోత్సాహకాలను (Cash Incentives) అందించనున్నట్లు వెల్లడించారు. గతంలో ఒకప్పుడు జనాభా నియంత్రణను సమర్థించిన తానే.. మారుతున్న కాలం, రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను బట్టి ఇప్పుడు జనాభా వృద్ధిని ప్రోత్సహించాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు.

Andhra Pradesh Cash Incentives Third Fourth Child Chandrababu Naidu Population TFR

జనాభా తగ్గితే ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం! TFR లెక్కలు ఇవే..

ఆదాయాలు పెరుగుతున్న కొద్దీ కొందరు దంపతులు ఒకే బిడ్డతో సరిపెట్టుకుంటున్నారని, మరికొందరు మొదటి సంతానం అమ్మాయి అయితేనే రెండో బిడ్డ గురించి ఆలోచిస్తున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు (Total Fertility Rate - TFR) పడిపోతోందని హెచ్చరించారు.

  • TFR 2.1 ముఖ్యం: ఏదైనా ఒక సమాజం స్థిరంగా, సమాన వయసు గల వ్యక్తులతో ముందుకు సాగాలంటే ప్రతి మహిళకు సగటున 2.1 ఫెర్టిలిటీ రేటు ఉండాలి. ఏపీలో ప్రస్తుతం ఇది 1.5 కి పడిపోయింది.
  • వృద్ధుల జనాభా ముప్పు: జనాభా తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగిన పలు దేశాల్లో (Ageing Societies) ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆయన గుర్తుచేశారు.
  • పిల్లలు భారం కాదు: పిల్లలు భారం అనే భావనను తిరస్కరిస్తూ.. వారే దేశానికి నిజమైన ఆస్తి అని, దాన్ని తాము నిరూపిస్తామని టీడీపీ అధినేత పేర్కొన్నారు. ఇదే క్రమంలో పాఠశాల విద్యార్థులకు ఏడాదికి రూ. 15,000 ఇచ్చే 'తల్లికి వందనం' పథకం మొత్తాన్ని కూడా "దేవుడు కరుణిస్తే" మరింత పెంచుతామని హింట్ ఇచ్చారు.

శ్రీకాకుళం ప్రాజెక్టుల డెడ్‌లైన్స్!

పాలనాపరమైన సంస్కరణలపై మాట్లాడుతూ.. పటిష్టమైన, ట్యాంపర్-ప్రూఫ్ పట్టాదార్ పాస్‌బుక్‌లను ప్రభుత్వం ముద్రిస్తోందని, మార్చి 2027 నాటికి రాష్ట్రంలో ఎలాంటి 'భూవివాదాలు' లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోసం పలు నీటిపారుదల ప్రాజెక్టుల కాలపరిమితిని (Timelines) సీఎం ప్రకటించారు..

  • మడ్డువలస స్టేజ్-II ప్రాజెక్ట్: జనవరి 2027 నాటికి పూర్తి.
  • హీరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్: ఏప్రిల్ 2027 నాటికి పూర్తి.
  • తోటపల్లి డిస్ట్రిబ్యూటరీలు: జూలై 2027 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

ఇక పారిశుద్ధ్యం విషయానికి వస్తే, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 86 లక్షల టన్నుల పాత చెత్తను (Legacy Waste) క్లియర్ చేశామని, జూన్ నాటికి 100 శాతం క్లియరెన్స్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇకపోతే ప్రస్తుతం అంతర్జాతీయంగా నడుస్తున్న 'యూఎస్ - ఇజ్రాయెల్ - ఇరాన్' సంక్షోభం వల్ల రాబోయే ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన మార్గదర్శకాలను ప్రజలంతా పాటించాలని సీఎం చంద్రబాబు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+