ఏపీలో అవినీతి తిమింగలాల పని పడతామని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ జనరల్ (డీజీ) అతుల్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. అవినీతిపరులపై ఇప్పటికే నిఘా పెట్టామని వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు మరింత దూకుడుగా ముందుకెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. అవినీతి పరుల బినామీ ఆస్తులను గుర్తించేందుకు ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను తొలిసారిగా వినియోగిస్తున్నామని ఆయన హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన వారిని మూడేళ్లలోనే శిక్ష పడేలా చేసి జైలుకు పంపడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తేల్చి చెప్పారు.
శుక్రవారం విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలన భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన అతుల్ సింగ్.. 2025 సంవత్సరానికి సంబంధించిన ఏసీబీ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా శాఖ కొత్త వ్యూహాలు.. భవిష్యత్ కార్యాచరణపై వివరించారు. ఈ సమావేశంలో ఏసీబీ డైరెక్టర్ ఆర్. జయలక్ష్మి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కరుడుగట్టిన అవినీతిపరులపై ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. వారి పేరుపై కాకుండా బినామీల పేర్లతో కూడబెట్టిన ఆస్తుల వివరాలను ఏఐ సాయంతో సేకరిస్తున్నాం. ఈ ఏడాది అవినీతి తిమింగలాల పని పడతాం. అవినీతికి పాల్పడినవారికి మూడేళ్లలోనే శిక్ష పడేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని అతుల్ సింగ్ పేర్కొన్నారు.బినామీ ఆస్తులను గుర్తించేందుకు ఐజీఆర్ఎస్ (ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రెడ్రెస్ సిస్టమ్)తో పాటు రిజిస్ట్రేషన్ శాఖ డేటా, అనుమానాస్పద బ్యాంకు లావాదేవీల వివరాలను ఏఐ ద్వారా విశ్లేషించనున్నట్లు తెలిపారు. ఈ విధానంతో సంపాదనకు మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
2025 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 115 అవినీతి కేసులు నమోదు చేసినట్లు డీజీ వెల్లడించారు. ఇందులో రెవెన్యూ శాఖలోనే అత్యధికంగా 19 ట్రాప్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతేడాది ఏసీబీ కేసుల్లో శిక్షల రేటు 46 శాతం మాత్రమే ఉందని అంగీకరించిన ఆయన, ఇది సంతృప్తికర స్థాయి కాదని స్పష్టం చేశారు. శిక్షల రేటును పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.కోర్టుల్లో సాక్షులు మాట మార్చకుండా ఉండేందుకు ఇకపై వారి వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 కింద నమోదు చేయించనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల కేసులు బలంగా నిలబడతాయని, నిందితులకు శిక్ష పడే అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
అవినీతి నిర్మూలనలో ప్రజల పాత్ర అత్యంత కీలకమని అతుల్ సింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని పూర్తిగా అరికట్టాలంటే ప్రజల సహకారం తప్పనిసరి. పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064, వాట్సాప్ నెంబర్ 9440440057లను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది రెవెన్యూ శాఖతో పాటు మరో నాలుగు కీలక శాఖలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు ప్రకటిస్తూ.. అవినీతిపై పోరాటంలో ఏసీబీ వెనక్కి తగ్గదని డీజీ స్పష్టం చేశారు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..



Click it and Unblock the Notifications