అమరావతిలో అభివృద్ధి పనులకు ఆమోదం.. రియల్ ఎస్టేట్ రంగానికి మళ్ళీ రెక్కలు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి పనులకు శంకుస్థాన పడింది. దింతో ఎప్పుడెప్పుడా అని ప్రజల ఎదురు చూపులకి శుభం కార్డు పడ్డట్టు అయింది. అయితే ఒక విధంగా రాజధాని నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఉపందుకోనుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ.8,821.44 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఎ) సమావేశంలో ఈ
ఆమోదం లభించింది.
అమరావతిలో రోడ్ల నిర్మాణంపై సీఆర్డీఏ సమావేశం దృష్టి పెట్టింది. ఈ సమావేశం తరువాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఎయుడి) మంత్రి పి నారాయణ ల్యాండ్ పూలింగ్ పథకం కింద భూములు సేకరించిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.3,807 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

అలాగే 4,521 కోట్లతో ట్రంక్ రోడ్లు వేస్తామని మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాల నిర్మాణానికి రూ.492 కోట్లు కేటాయించామని నారాయణ తెలిపారు. సీఆర్‌డీఏ గత సమావేశాల్లో రూ.11,471 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపిందని, మంగళవారం సమావేశం తర్వాత ఇప్పుడు రూ.20,292.46 కోట్లకు పెరిగిందని చెప్పారు.
నేలపాడు, రాయపూడి, అనంతవరం, దొండపాడు గ్రామాల పరిధిలో 236 కిలో మీటర్ల మేర లేఅవుట్లు, 97.5 కిలో మీటర్ల మేర ట్రంక్ రోడ్లు మంజూరయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. 2014 నుంచి 2019 వరకు రూ.41 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, అయితే అందులో రూ. 5 వేల కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయని ఇంకా నిర్మాణ ఖర్చులు పెరిగాయని దీంతో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంత్రి నారాయణ తెలిపారు.
పనులు కొనసాగించడంలో ఆలస్యం వల్ల ఖర్చులు 25 శాతం నుంచి 28 శాతానికి పెరిగాయని, భవనాల నిర్మాణ వ్యయం 35 శాతం నుంచి 55 శాతానికి పెరిగాయని చెప్పారు. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అమరావతి రాజధానికి అనుమతిస్తే అభివృద్ధి పనుల వ్యయం 45 శాతం పెరిగి ఉండేది కాదన్నారు. ఆమోదించిన ఈ అభివృద్ధి పనులకు డిసెంబర్ 15లోగా టెండర్లు పిలిచే ప్రక్రియ ప్రారంభించి ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
ఈ అభివృద్ధి పనుల ప్రారంభంతో ఒక వైపు స్థలాల రేట్లే కాకుండా ఇళ్ల రేట్లు కూడా మరింత పెరగనున్నాయి. ఈ లెక్కన చూస్తే రానున్న రోజులు అమరావతికి సమీపంలో ఇతర రంగాలకు డిమాండ్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications