Multibagger Stock: దేశంలోని మౌలికసదుపాయాల రంగం చాలా వేగంగా పుంజుకుంటున్న తరుణంలో అనుబంధ రంగాల కంపెనీలు వృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు స్వల్ప కాలంలోనే మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఆంధ్రా సిమెంట్స్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. అవును ప్రస్తుతం ఈ స్టాక్ ధర రాకెట్ వేగంతో పైకెళుతోంది. గత కొంత కాలంగా స్టాక్ వరుసగా అప్పర్ సర్క్యూట్లను తాకుతోంది. ఈ సిమెంట్ స్థాక్ ఏడాది కాలంలోనే ఇన్వెస్టర్లకు దాదాపు 150 శాతం రాబడిని అందించింది.

సాగర్ సిమెంట్స్ యాజమాన్యంలో పనిచేస్తున్న కంపెనీ షేర్ ధర నేడు మార్కెట్లో రూ.143.90 వద్ద ఉంది. జూన్ 6, 2022న స్టాక్ ధర రూ.9.25 వద్ద ఉంది. అప్పట్లో ఎవరైనా ఇన్వెస్టర్ ఈ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే నేటి మార్కెట్ ధర ప్రకారం దాని విలువ రూ.15.55 లక్షలుగా ఉండేది. ఇలా ఏడాది కాలంలోనే సిమెంట్ కంపెనీ తన ఇన్వెస్టర్లకు బలమైన రాబడులను అందించింది.
ఇదే క్రమంలో స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.4.90 వద్ద ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.143.90గా ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశ నిర్మాణాన్ని గతంలో ఎన్నడూ లేని వేగంతో ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో సిమెంట్ రంగం సైతం భారీగా లాభపడుతోంది. అందుకే ఇన్వెస్టర్లు సైతం ఇటీవల ఈ రంగంలో పెట్టుబడి అవకాశాలపై దృష్టి సారించారు. ఈ కంపెనీ స్వాతంత్య్రానికి ముందర డిసెంబర్ 1936లో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేశారు.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications