mahindra: భారతీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. వ్యాపారవేత్తగానే కాకుండా ఎల్లప్పుడూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లకు అందుబాటులో ఉంటారు. ఫన్నీ, సోషల్ అవేర్ నెస్ సహా పలు ఆసక్తికర వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. తాజాగా ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి:
ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవేలో భాగంగా దౌసా సెక్షన్ ను ప్రధాని నరేంద్ర మోడీ రేపు ప్రారంభిచనున్నారు. రాత్రివేళ విద్యుత్ దీపాల కాంతిలో ఈ రహదారి అందాల వీడియోను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ వీడియో పై ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో స్పందించారు.
నైట్ వ్యూ సూపర్:
రాత్రివేళ రహదారి వ్యూ అద్భుతంగా ఉందని మహీంద్రా ప్రశంసించారు. మౌలిక సదుపాయాలు బోరింగ్ కాదని ఓ మాయాజాలమని కొనియాడారు. ఈ రోడ్డుపై ప్రయాణించాలని తాను భావించానని, కానీ ఈ వీడియో చూసిన తర్వాత నైట్ రైడ్ కు వెళ్తానని తెలిపారు. కేంద్ర మంత్రి గడ్కరీ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాదాపు 490 వేల వ్యూస్ తో పాటు 13 వేల లైక్ లు వచ్చాయి.

ఆర్థిక వృద్ధికి తోడ్పాటు:
ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేలోని 246 కిలోమీటర్ల ఢిల్లీ-దౌసా-లాల్సోట్ సెక్షన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. తద్వారా దేశ రాజధాని నుంచి జైపూర్ కు గంటన్నర ప్రయాణం తగ్గుతుంది. రూ.12,150 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎక్స్ ప్రెస్ వే మొదటి దశ.. ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి గణనీయమైన తోడ్పాటు అందిస్తుందని PMO తెలిపింది.

ఆరు రాష్ట్రాలను కలుపుతూ..
ఈ ఎక్స్ ప్రెస్ వే భారతదేశంలోనే అతి పొడవైనది కాగా.. ఢిల్లీ నుంచి ముంబై మధ్య దూరం 12 శాతం తగ్గుతుంది. ప్రస్తుత ప్రయాణ సమయం 24 గంటలు కాగా.. ఇక నుంచి 12 గంటల్లో చేరుకోవచ్చు. కోటా, ఇండోర్, జైపూర్, భోపాల్, వడోదర, సూరత్ సహా 6 రాష్ట్రాల్లోని ముఖ్యమైన పట్టణాలను కలుపుతూ వెళ్తుంది.


Click it and Unblock the Notifications