హైదరాబాద్: కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అనే బ్రాండ్ ఉండేది హైదరాబాద్‌కు. తక్కువ జీతమైనా ఇక్కడ ఏ చీకూ చింతా లేకుండా హాయిగా జీవితం గడిపేయవచ్చనే గుర్తింపు ఉండేది. ఇప్పుడది క్రమంగా కనుమరుగువుతూ వస్తోంది. హైదరాబాద్‌లో మూడేళ్ల వ్యవధిలో ఎప్పుడూ లేనంతగా నివాస గృహాల ధరలు, అద్దె భారీగా పెరిగాయి.
దీనికి కారణాలు లేకపోలేదు. దక్షిణాదిలో చెన్నై, బెంగళూరు కంటే కూడా హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను నెలకొల్పడానికి మల్టీ నేషనల్ కంపెనీలు మొగ్గు చూపిస్తోండటమే. దీని ప్రభావం ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్ స్పేస్‌లతో పాటు రెసిడెన్షియల్ సెగ్మెంట్‌పైనా తీవ్రంగా పడినట్టయింది.

రియల్ ఎస్టేట్ ఏ నగరంలో పురోగమించిందనే విషయంపై అనరాక్ అనే సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతల్లో ఆఫీస్, రెసిడెన్షియల్ డిమాండ్, రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో చోటు చేసుకున్న మార్పుల ఆధారంగా ఆ సంస్థ ఈ నివేదికను తయారు చేసింది.
ఇందులో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. మిగిలిన నగరాల కంటే ఇక్కడే 33 శాతం మేర అద్దె రేట్లు పెరిగాయి. గచ్చిబౌలిలో అద్దె రేట్లు గరిష్ఠంగా 33 శాతం పెరిగినట్టు వివరించింది. కొండాపూర్ రెండో స్థానంలో నిలిచింది. 2020 అక్టోబర్ గచ్చిబౌలిలో ఒక చదరపు అడుగు అద్దె 4,790 రూపాయలు ఉండగా.. ఈ ఏడాది అక్టోబర్ నాటికి అది 6,355 రూపాయలకు చేరింది.
కొండాపూర్‌లో 2020 అక్టోబర్‌లో ఒక చదరపు అడుగుకు 4,650 రూపాయల మేర అద్దె వసూలు చేస్తోండగా.. అది ఈ ఏడాది అక్టోబర్ నాటికి 6,090 రూపాయలకు పెరిగింది. ఇక్కడ 31 శాతం పెరుగుదల కనిపించింది.

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్- 29 శాతం, థనిసంద్ర మెయిన్ రోడ్- 27, సర్జాపూర్ రోడ్- 26 శాతం అద్దె రేట్లు పెరిగాయి. పుణేలోని వాఘోలి- 25, హింజేవాడి-22, వకాడ్- 19 శాతం పెరుగుదల రికార్డయింది. ముంబైలోని లోయర్ పరేల్- 21, అంధేరి- 19, వర్లీ- 13 శాతం పెరుగుదల కనిపించింది.
ఢిల్లీ- ఎన్‌సిఆర్ పరిధిలో గల గ్రేటర్ నోయిడా వెస్ట్- 27, సెక్టార్ 150- 25, రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్- 21 శాతం మేర అద్దె ధరలు పెరిగాయి. చెన్నైలోని పెరుంబాక్కం- 19, గుడువంచేరి- 17, పెరంబూర్- 15 మేర అద్దె ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. కోల్‌కతాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 13 నుంచి 29 శాతం వరకు అద్దె రేట్లు పెరిగాయి.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications