Real Estate News: గతకొన్ని నెలలుగా రియల్టీ మార్కెట్లు దేశవ్యాప్తంగా స్తబ్ధుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని ఐకానిక్ నగరంగా ఉన్న హైదరాబాదులోనూ ఇదే ధోరణి కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా అనరాక్ గ్రూప్ ఇచ్చిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కేవలం 25 డీల్స్ ద్వారా 325 ఎకరాల కొనుగోళ్లు జరిగినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ల్యాండ్ కొనుగోళ్లు 57 శాతం పడిపోయినట్లు వెల్లడైంది. గత ఏడాది ఇదే సమయంలో 721 ఎకరాలు అమ్ముడైనట్లు వెల్లడైంది. వాస్తవానికి డీల్స్ భారీగా పడిపోవటానికి దేశంలో జరిగిన లోక్ సభ ఎన్నికలు ప్రధాన కారణంగా ఉండగా, భారీగా పెరిగిన భూమి ధరలు కొనుగోళ్లు తగ్గటానికి రెండవ కారణంగా నిలుస్తోందని అనరాక్ వెల్లడించింది.

ప్రస్తుతం జరిగిన త్రైమాసికంలో అత్యధికంగా డీల్స్ బెంగళూరు నగరంలో జరిగాయని అనరాక్ పేర్కొంటూ మెుత్తం 9 ఒప్పందాలతో 114 ఎకరాల భూమి క్రయవిక్రయాలు రియల్టీ రంగంలో జరిగినట్లు వెల్లడించింది. ఇక రెండవ స్థానంలో 7 డీల్స్ ద్వారా అత్యధికంగా 77.5 ఎకరాల స్థలం అమ్మకాలు జరిగాయి. ఈ డీల్స్ వ్యవసాయం, మిశ్రమ వినియోగ అభివృద్ధి, డేటా సెంటర్‌లు, లాజిస్టిక్స్ పార్కులు, పారిశ్రామిక, రిటైల్‌లో డీల్స్ జరిగాయి. ఇదే క్రమంలో ముంబైలో 34 ఎకరాల కొనుగోళ్లు నమోదయ్యాయి.
హైదరాబాద్ పరిస్థితి:
తెలంగాణలో ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షిస్తున్న ప్రధాన నగరంగా ఉన్న హైదరాబాద్ మాత్రం పెద్ద కుదుపును రియల్టీ రంగంలో చూసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడీవేడిగా ఎన్నికల సమరం జరగటం ఇక్కడ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో హైదరాబాద్ మహానగరంలో కేవలం ఒక్క రియల్టీ డీల్ మాత్రమే జరగటం గమనార్హం. ఇందులో 48 ఎకరాల భూ కొనుగోలు జరిగింది.
దేశీయ రియల్టీ రంగంలో ఈ ఏడాది 6 నెలల్లో 54 ఒప్పందాల ద్వారా 1,045 ఎకరాలకు పైగా భూముల కొనుగోళ్లు జరిగినట్లు అనరాక్ వెల్లడించింది. ఈ క్రమంలో ఇతర ప్రధాన నగరాల్లో లావాదేవీలను పరిశీలిస్తే చెన్నైల్లో 63.5 ఎకరాలు, పుణె-అహ్మదాబాద్-నోయిడా-థానేల్లో 103 ఎకరాలు, ఘజియాబాద్‌లో 62.5 ఎకరాలు, దిల్లీలో 5 ఎకరాల భూముల కొనుగోళ్లు జరిగాయి. ఇదే క్రమంలో అయోధ్య-జైపూర్-సూరత్ సంయుక్తంగా 353 ఎకరాలకు డీల్స్ నమోదు చేశాయి.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

హైదరాబాద్‌లో గుడ్డిగా ఇల్లు కొని మోసపోవద్దు.. అనుమతులపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన హైడ్రా..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications