Bengaluru: బెంగళూరులో ఇళ్లకు భారీ డిమాండ్.. దేశంలోనే నంబర్ వన్..!
దేశంలో ఇళ్ల కొనుగోళ్లు తగ్గినప్పటికీ బెంగళూరులో మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. బెంగళూరులో ఇళ్లకు డిమాండ్ ఉందని అనారాక్ రీసెర్చ్ తెలిపింది. దేశంలో అత్యధిక అమ్మకాలు ముంబైలో ఉండగా.. ఢిల్లీ ఎన్సీఆర్ లో కూడా ఇళ్లకు డిమాండ్ ఉంది. దేశంలోని నగరాల్లో గృహ అమ్మకాలు గత ఏడాది 96,285 ఇళ్లు అమ్ముడయ్యాడు. అయితే 2026 రెండవ త్రైమాసికంలో 6 శాతం తగ్గింది. 90,715 యూనిట్లకు పడిపోయాయి. అయితే కొత్త గృహ నిర్మాణ ప్రాజెక్టులు వార్షికంగా 7 శాతం పెరిగి సుమారు 1.06 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. స్వల్పకాలిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక డిమాండ్‌పై డెవలపర్లు విశ్వాసంతో ఉన్నారు.
వార్షికంగా అమ్మకాల వృద్ధిని నమోదు చేసిన మూడు నగరాల్లో బెంగళూరు ఒకటి. ఈ త్రైమాసికంలో నివాస అమ్మకాలు 1 శాతం పెరిగి సుమారు 15,285 ఇళ్లకు చేరుకున్నాయి. ఈ నగరంలో కొత్త ఇళ్లు, అపార్ట్ మెంట్ల నిర్మాణం ఎక్కువగా కనిపించింది. కొత్తగా ప్రారంభించిన గృహాలు గత ఏడాదితో పోలిస్తే 41 శాతం పెరిగి సుమారు 21,670 ఇళ్లకు చేరుకున్నాయి. దాదాపు 96 శాతం రూ.80 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం, లగ్జరీ ఇళ్లే ఉన్నాయి. దీన్ని బట్టి ఇక్కడ డబ్బు ఉన్నవారు ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్, ఐటీ కంపెనీల్లో పని చేస్తున్నవారు ఎక్కువ మంది ఉండడంతో ఇళ్లకు డిమాండ్ పెరిగినట్లు నివేదిక పేర్కొంది.

ఈ నగరంలో గృహాల ధరల్లో 8 శాతం వార్షిక పెరుగుదల నమోదైనట్లు వివరించింది. టాప్ ఏడు నగరాలలో అందుబాటులో ఉన్న ఇళ్లు(అమ్మడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు అత్యధిక ఉన్నాయి. అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 34% పెరిగింది. GCC ఉపాధి కేంద్రాలు, మౌలిక సదుపాయాల ఆధారిత కారిడార్లు పరిసర ప్రాంతాల్లో ప్రీమియం గృహాలు డిమాండ్ కనిపిస్తున్నట్లు పేర్కొంది. అటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) 8 శాతం వార్షిక క్షీణతను నమోదు చేసినప్పటికీ.. 2026 రెండవ త్రైమాసికంలో సుమారు 28,710 ఇళ్లు అమ్ముడయ్యాయి.
ముంబై, బెంగళూరులో కలిసి దాదాపు 44,000 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో కూడా ఈ రెండు నగరాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ త్రైమాసికంలో ముంబైలో దాదాపు 34,555 కొత్త ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 23 శాతం ఎక్కువ. బెంగళూరు 21,670 కొత్త ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యాయి. బెంగళూరులో ఐటీ అభివృద్ధి, మౌళిక సదుపాయాల అభివృద్దితో అక్కడ ఇళ్లు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. అంతేకాకుండా అక్కడ అద్దెకు ఉండడం కంటే.. సొంత ఇల్లు కొనుగోలు చేయడమనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. అందుకే అక్కడ ఇళ్లకు డిమాండ్ పెరిగినట్లు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications