Secret Revealed: కుమార మంగళం బిర్లా సీక్రెడ్ బయటపెట్టిన కూతురు అనన్యా బిర్లా..!!
Ananya Birla: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరు కుమార మంగళం బిర్లా. దేశంలో బిర్లాలు అనేక వ్యాపారాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈయనకు సంబంధించిన విషయం ఒకటి బయటకు వచ్చింది.
కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్యా బిర్లా. ఆమె ఒక సింగర్, సాంగ్ రైటర్ కూడా. తాజాగా బిలియనీర్ కుమార్తె తన తండ్రికి సంబంధించిన ఒక సీక్రెట్ బయటపెట్టారు. తన తండ్రి సైతం రీల్స్ చూసేందుకు సీక్రెట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కలిగి ఉన్నారంటూ కుండ బద్దలు కొట్టేసింది. అందరు మాదిరిగా ఆయన సైతం రీల్స్ చూస్తూ ఆస్వాధిస్తారని ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు.

2019లో కుమార్ మంగళం బిర్లా తన పిల్లలను తనిఖీ చేయడానికి రహస్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పేరు ఏమిటో వెల్లడించడానికి ఆమె నిరాకరించారు. వాస్తవానికి ఆ ఖాతాకు సంబంధించిన వివరాలు తనకు తెలియవని.. వివరాలను పిల్లలు అందరితో పంచుకుంటారనే ఉద్యోశంలో కుమార మంగళం బిర్లా తమకు వెల్లడించలేదని అనన్యా బిర్లా పేర్కొన్నారు. అలాగే తన తండ్రి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు Pinterest కూడా ఉపయోగిస్తారని ఆమె వెల్లడించారు.
బిలియనీర్ కుమార మంగళం బిర్లాకు మెుత్తం ముగ్గురు పిల్లలు. ఇందులో అనన్యా, అద్వేషితా అనే ఆడపిల్లలు ఉండగా.. ఆర్యమాన్ అనే కుమారుడు ఉన్నారు. మంచి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న అనన్యా.. డిజైన్-లీడ్ హోమ్ డెకర్ బ్రాండ్ ఐకై అసై, భారతదేశంలో మానసిక ఆరోగ్యం గురించి సంభాషణల ఆవశ్యకతను సూచించే ఎంపవర్ సంస్థ వ్యవస్థాపకురాలుగా ఉన్నారు. అలాగే ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన సంస్థ అయిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో డైరెక్టర్ల బోర్డులో కూడా సభ్యురాలిగా కొనసాగుతున్నారు.


Click it and Unblock the Notifications