తండ్రికి తగ్గ తనయగా ఈషా అంబానీ వ్యాపార కార్యకలాపాల్లో దూసుకుపోతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా సైతం అదే బాటలో నడుస్తోంది. 2013లో స్టార్ట్ చేసిన తన మైక్రోఫైనాన్స్ బిజినెస్ ను 118 శాతం వార్షిక వృద్ధి రేటుతో పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా ఓ భారీ సంస్థను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు.
అనన్య బిర్లా ప్రమోట్ చేసిన మైక్రో లెండింగ్ కంపెనీ స్వతంత్ర. 19 రాష్ట్రాల్లో 7 వేల మంది ఉద్యోగులతో వినియోగదారులకు సేవలందిస్తోంది. కాగా ఇప్పుడు ఫ్లిప్ కార్డ్ సహ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్ నావీ గ్రూపుకు చెందిన అనుబంధ సంస్థ చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ ను కొనుగోలు చేయనున్నట్లు స్వతంత్ర ప్రకటించింది.

మార్చి 2023 నాటికి చైతన్య 4 వేల 900 కోట్ల ఆస్తులు కలిగి ఉంది. ఈ ఏడాది జూన్ లో 75 కోట్ల క్యాపిటల్ సేకరించింది. 12 రాష్ట్రాల్లోని 1.4 మిలియన్ వినియోగదారులకు తన 6 వేల మంది ఉద్యోగుల ద్వారా సేవలందిస్తోంది. స్వతంత్ర, చైతన్యల మధ్య జరనున్న ఈ డీల్ విలువ 1,479 వేల కోట్లని తెలుస్తోంది. తద్వారా రెండవ అతిపెద్ద మైక్రోఫైనాన్స్ సంస్థగా స్వతంత్ర అవతరించనుంది.
తన మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ (MFI) ల్యాండ్ స్కేప్ ను విస్తరిస్తున్నట్లు స్వతంత్ర ప్రకటించింది. 20 రాష్ట్రాల్లోని 1,517 శాఖల ద్వారా 3.6 మిలియన్లకు పైగా యాక్టివ్ కస్టమర్లను చేరుకోనున్నట్లు వెల్లడించింది. మార్చి 31, 2023 నాటికి ఉమ్మడి ఆస్తున నిర్వహణ 12 వేల 409 కోట్లకు చేరనున్నట్లు చెప్పింది.


Click it and Unblock the Notifications