Ambani News: అన్న-సోదరిపై కీలక కామెంట్స్ చేసిన అనంత్ అంబానీ..! పోటీ మెుదలైందా..
Anant Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ. ప్రస్తుతం అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లో దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. గుజరాత్ జామ్‌నగర్ లో ఏర్పాట్లు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. తన సోదరి-సోదరుడిపై సంతోషం వ్యక్తం చేశారు. తన తోబుట్టువులను పోటీదారులుగా తాను భావించేందుకు నిరాకరించారు. అన్నయ్య ఆకాష్ తనకు రాముడిలాంటివాడని, అక్క ఇషా తనను తల్లిలా కాపాడుతుందని అనంత్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇందులో అనంత్ తన అన్న, చెల్లితో తనకున్న రిలేషన్ షిప్ గురించి ఓపెన్ గా మాట్లాడాడు.

ఆకాష్ అంబానీని తన గురువుగా భావిస్తున్నానని అనంత్ చెప్పాడు. తమ మధ్య ఎటువంటి పోటీ లేదని, అన్నయ్య తనకు సలహాదారు వంటివాడని అన్నాడు. తాను ఆకాష్‌ని హనుమాన్ అని పిలుస్తానని, అతని సలహాలను అనుసరించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఇదే క్రమంలో అనిల్-ముఖేష్ అంబానీల మధ్య గతంలో ఉన్న వైరం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తన కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ప్రేమాభిమానాలు ఎక్కువ కాబట్టి తనకు అలాంటి పరిస్థితులు ఎదురుకావని అనంత్ బదులిచ్చాడు. తాము ఎల్లప్పుడూ కలిసి ఉంటామన్నారు.
తన తాత ధీరూభాయ్ అంబానీ అడుగుజాడలను ఫాలో అవుతానని.. కానీ తాను ఆ స్థాయికి చేరుకోలేదని అన్నాడు. అంబానీ కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఏమైనా ఒత్తిడి ఉందా అనే ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటి పరిస్థితులు అస్సలు లేవని తెలిపాడు. తాను చేసే ప్రతి పని హృదయం నుంచి వచ్చిందేనని, దేవుడు కోరుకున్నది జరుగుతుందని అన్నాడు. తాను తండ్రి ముఖేష్ దార్శనికతను అనుసరించి ముందుకు సాగుతానన్నాడు. ముఖేష్ అంబానీ స్ట్రిక్ట్ ఫాదర్ కాదని, తమతో స్నేహితుడిలా ఉండేవారని అనంత్ చెప్పారు. కఠినమైన తండ్రి కంటే ఎక్కువ స్నేహితుడిగా అభివర్ణించాడు.


Click it and Unblock the Notifications