Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
Ambani Donations: దేశంలోని అగ్ర వ్యాపారవేత్త, ఆసియాలోనే సంపన్నుడైన రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ. సమాజసేవ విషయంలో తల్లిదండ్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా వ్యవహరిస్తున్నారు అనంత్ అంబానీ.
తాజాగా అనంత్ తన పెళ్లి సందర్భంగా ఆలయాలకు వెళ్లి విరాళాలు అందిస్తున్నారు. ప్రస్తుతం అంబానీ ఇంట అనంత్-రాధికా మర్చంట్ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరి వివాహం జూలైలో నిర్వహించేందుకు రెండు కుటుంబాలు ఇప్పటికే కార్యక్రమాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనంత్ అంబానీ పలు ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహిస్తున్నారు. రెండు ఆలయాలకు దాదాపు రూ.5 కోట్ల మేర విరాళంగా అందించినట్లు వెల్లడైంది.

మంగళవారం అనంత్ అంబానీ అసోం గౌహతిలోని కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజల తర్వాత అనంత్ ఆలయానికి రూ.2.51 కోట్లను విరాళంగా అందించారు. అలాగే రిలయన్స్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్న అనంత్ పూరీ జగన్నాథుని ఆలయానికి సైతం రూ.2.51 కోట్లను విరాళంగా ఇచ్చారు. అంబానీ తనయుడికి ఆలయ అధికారులు ప్రత్యేక స్వాగతం పరికారు. పూజలు ముగించిన ఆనంద్ అంబానీ.. ఆలయానికి మూడు వెండి తలుపులు బహూకరిస్తానని చెప్పారు. ఆ తర్వాత రూ.2.51 కోట్లను అందించాడు.
ముఖేష్ అంబానీ కుటుంబం గుజరాత్‌లోని జామ్ నగర్‌లో 14 కొత్త ఆలయాలను నిర్మించడానికి విరాళంగా ఇచ్చింది. ఆ నగరంలోనే అనంత్ అంబానీ వివాహానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి ముందు రాజస్థాన్‌లోని రాజ్‌సమంతిలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో అనంత్-రాధికల నిశ్చితార్థ వేడుక అంటే సాంప్రదాయ రోఖా వేడుక జరిగింది. అలాగే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లు ఈ ఏడాది మార్చిలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగాయి. మూడు రోజులు కొనసాగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుంచి.. బాలీవుడ్-హాలీవుడ్ తారలు, సంపన్నులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications