Radhika Ambani: గత కొన్ని రోజులుగా దేశంలోని సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కోడలికి సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని నెలల కిందట రాధిక మర్చంట్-అనంత్ అంబానీ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. గత నెలలో రాధిక ప్రెగ్నెంట్ అంటూ కొన్ని వార్తలు వినిపించినప్పటికీ ఆ రూమర్స్ పై రాధిక తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల ఆఖరి కుమారుడు అనంత్ అంబానీ. ఇంట్లో అందరికీ అతనంటే ప్రత్యేకమైన శ్రద్ధతో పాటు ఇష్టం. అనేక అనారోగ్య సమస్యలను తన జీవితంలో ఎదురించటానికి తన తల్లిదండ్రులు జీవితంలో తోడుగా నిలిచారని పెళ్లికి ముందు అనంత్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మర్చంట్‍ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. దేశవిదేశాలకు చెందిన అతిథుల మధ్య అంగరంగవైభంగా జరిగిన వివాహ వేడుకతో ఈ దంపతులు ఒక్కరయ్యారు. ఈ క్రమంలో రాజకీయ, సినీ, క్రికెట్ సహా అనేక ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పెళ్లిలో మెరిశారు.

ఈ పెళ్లికి అంబానీ కుటుంబం ఏకంగా రూ.5,000 కోట్లను వెచ్చించిన సంగతి తెలిసిందే. అంబానీ ఫ్యామిలీకి ఉన్న మెుత్తం ఆస్తిలో ఇది కనీసం అరశాతం కూడా కాదు. ఈ క్రమంలో ఇటీవల రాధిక మర్చంట్ తాజాగా ధరించిన హ్యాండ్ బ్యాగ్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీని ధర గురించి భారీ ఎత్తువ చర్చ కొనసాగుతోంది. అంబానీ ఫ్యామిలీ సభ్యులు వివిధ సందర్భాల్లో ధరించిన లేదా వినియోగించిన హ్యాండ్ బ్యాగ్ ధరలు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పైగానే ఉన్నాయని తేలింది. అయితే ఈ రేట్లు వివిధ బ్రాండ్లు, వాటి క్వాలిటీ, మోడల్ వంటి వివిధ ప్రమాణాలతో మారుతుంటాయి.
NMACC లాంచింగ్ ఈవెంట్‌లో రాధిక మర్చంట్ ధరించిన హ్యాండ్ బ్యాగ్ ధర సుమారు రూ.52 లక్షలుగా ఉంది. ఇషా అంబానీతో కలిసి ఆమె ధరించిన లేడీ డియోర్ మినీ హ్యాండ్‌బ్యాగ్ ధర సుమారు రూ.21 లక్షలుగా ఉంది. సహజంగా సెలబ్రిటీ ఫ్యామిలీలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు తమ అంతస్తు హోదాకు అనుగుణంగా ప్రముఖ లగ్జరీ బ్రాండ్‌లకు చెందిన ఉత్పత్తులు వినియోగిస్తారు. వీటి తయారీలో ఉపయోగించే మెటీరియల్ అదురుదా దొరకటం, ప్రత్యేకంగా కొన్ని మోడళ్లు తయారు చేయటంతో బ్యాగ్ ధరలు మారుతుంటాయి. ఈ బ్యాగ్‌లు చాలా వరకు నైపుణ్యం కలిగిన కార్మికులు హ్యాండ్‌మేడ్ పద్ధతిని వాడతారు కాబట్టి మిగిలిన వాటితో పోల్చితే ధర ఎక్కువగా ఉండాయి.


Click it and Unblock the Notifications