Radhika Merchant: దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు అయిన ముఖేష్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీలకు ముగ్గురు పిల్లలు. అయితే ఈ ఏడాది తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అతిథులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా వేల కోట్ల ఖర్చుతో శుభకార్యం ముగిసింది. దీంతో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ జంట కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది జూలై 12న కొత్త జంట పెళ్లి తర్వాత మొదటి ఇంటర్వ్యూలో రాధిక తన కెరీర్ ప్రయాణం, భవిష్యత్ లక్ష్యాల గురించి ఇటీవల మదిలోని మాటలు పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె అందరిలాగా కాకుండా పెళ్లైన కొన్ని నెలల్లోనే సంచలన నిర్ణయం తీసుకోవటం ప్రస్తుతం బిజినెస్ సర్కిల్స్ లో పెద్ద చర్చకు దారితీసింది. అధికారింగా అంబానీ కుటుంబంలో రాధిక కలిసిపోయారు. అఫిషీయల్‌గా కోడలు అయిపోయిన ఆమె ప్రస్తుతం తన పేరును కూడా మార్చుకోవటం గమనార్హం. ఈ క్రమంలో రాధిక తన పుట్టింటి పేరును తీసేసి మర్చంట్ ప్లేసులో అంబానీ అని ఇంటిపేరును మార్చుకున్నారు. మనం సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి ధనిక వ్యాపారవేత్తల వరకు ఎవరిని చూసినా కోడళ్లుగా వచ్చిన తర్వాత సైతం చాలా మంది తమ పేరులో పుట్టింటి పేరుకు చివరన అత్తింటి పేరును చేర్చుతుంటారు. కానీ రాధిక మాత్రం సాధారణ భారతీయ మహిళ మాదిరిగానే తన ఇంటి పేరును భర్త ఇంటి పేరుకు మార్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రాధిక మర్చంట్ మాత్రం తన అత్తవారి ఇంటి పేరు పెట్టుకోవడానికే మొగ్గు చూపించటంపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. రాధిక ఇటీవలే తన 30వ పుట్టినరోజును ముంబైలోని యాంటిలియా నివాసంలో ఘనంగా జరుపుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల నడుమ అత్తగారింట్లో జరిగిన మెుదటి వేడుక ఇది. మెడికల్ రిప్రజెంటేటివ్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన రాధిక అంబానీ.. తన తండ్రి స్థాపించిన ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌లో డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ఇండియాతో పాటు ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాలలో కంపెనీ ఉనికిని పెంచేందుకు ఆమె కృషి చేస్తున్నారు.
పెళ్లి కోలాహలం ఇలా..
అనంత్-రాధికా పెళ్లి సందడితో ముంబయిలోని వీధులన్నీ అతిథులతో కిక్కిరిసిపోయాయి. దాదాపుగా 2500 మంది ముఖ్యఅతిథులుగా వచ్చారు. ఇదే సమయంలో బాలీవుడ్ సెలబ్రిటీలు అంబానీ ఇంట పెళ్లిలో సందడి చేశారు. ఇదే క్రమంలో టాలీవుడ్ నటీనటులు, క్రికెట్ ప్లేయర్లతో పాటు అనేక రంగాలకు చెందిన సెలబ్రిటీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పెళ్లికి ముందు తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ అట్టహాసంగా జరిగాయి. కొద్ది రోజులపాటు ఎక్కడ చూసినా అనంత్ అంబానీ పెళ్లి గురించే మీడియా కూడా కథనాలను ప్రచురించిన సంగతి తెలిసిందే. పెళ్లిలో ఈ దంపతులు ధరించిన దుస్తుల నుంచి ఆభరణాలు, వేరబుల్స్ వరకు అన్నీ పెద్ద చర్చనీయాంశాలుగా నిలిచాయి. అలాగే అనంత్ తన సన్నిహుతులకు అందించిన ఖరీదైన బహుమతులు సైతం ఈ క్రమంలో చర్చకు దారితీశాయి.


Click it and Unblock the Notifications