రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ముంబైలో వివాహం చేసుకోబోతున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 12 నుంచి వీరి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. వీరి వివాహం హిందూ వైదిక సంప్రదాయాల ప్రకారం జరగనుంది
అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జూలై 12 నుండి శుభ వివాహం లేదా వివాహ వేడుకతో ప్రారంభమవుతాయి. దీని తర్వాత జూలై 13న శుభ ఆశీర్వాద్ లేదా దైవ ఆశీర్వాదాలు మరియు జూలై 14న మంగళ్ ఉత్సవ్ జరుగుతాయి.

ఒక్కో రోజు ఒక్కో డ్రెస్ కోడ్
జూలై 12వ తేదీ జరిగే శుభ వివాహ్ కార్యక్రమానికి డ్రెస్ కోడ్ భారతీయ సంప్రదాయ వస్త్రధారణను నిర్ణయించగా జూలై 13వ తేదీన జరిగే దైవాశీర్వాద వేడుకకు ఇండియన్ ఫార్మల్‌గా డ్రెస్ కోడ్‌ను డిసైడ్ చేశారు. ఇక జూలై 14వ తేదీన జరిగే మాంగళ్య ధారణ కార్యక్రమానికి ఇండియన్ చిక్ డ్రెస్ కోడ్‌గా డిసైడ్ చేశారు. ఈ కార్యక్రమాలు మొత్తానికి వేదికగా ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ నిలవనుంది.
ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అతిథులు
అంతకంటే ముందు మే 29వ తేదీన ఇటలీలో అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల జంట రెండవ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూన్ 1వ తేదీ వరకు ఈ వేడుకలు జరుగుతాయి. ఆ తర్వాత అంబానీ మనువరాలు వేద తొలి పుట్టిన రోజును కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు అంబానీ ఫ్యామిలీ ప్లాన్ చేసింది.
ఇక అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు పాల్గొననున్నారు. ఇందులో షారుఖ్ ఖాన్ కుటుంబం,సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్-దీపికా పదుకొనే, MS ధోనీ దంసతులు రణబీర్ కపూర్-ఆలియా భట్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు. వీరితో పాటు సోనమ్ కపూర్ ఆనంద్ అహుజా,ప్రియాంకా చోప్రా-నిక్ జోనాస్,కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా ఉన్నారు.

ఈ ఏడాది మార్చిలో,ఈ జంట గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు స్టార్-స్టడెడ్ ప్రీ-వెడ్డింగ్ బాష్‌ను నిర్వహించారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలకు బాలీవుడ్ ప్రముఖులు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు.
వరుడు అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీల చిన్న కుమారుడు. అనంత్ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ మరియు రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ బోర్డులలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అతను జామ్‌నగర్‌లో 3,000 ఎకరాల విస్తీర్ణంలో జంతు సంరక్షణ కేంద్రాన్ని కూడా స్థాపించారు. మరోవైపు వధువు రాధికా మర్చంట్ ఎన్‌కోర్ హెల్త్‌కోర్ CEO మరియు వైస్ ఛైర్మన్ విరెన్ ఎ మర్చంట్ మరియు శైలా మర్చంట్ కుమార్తె.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications