Ambani Marriage: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ వివాహం గురించి చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది రాధిక-అనంత్ వివాహ కార్యక్రమం పూర్తి కానుంది.
యువ అంబానీ త్వరలోనే రాధికా మర్చంట్ ను వివాహం చేసుకోనున్నారు. ఇందులో భాగంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఆహ్వానం ప్రముఖులకు, కుటుంబ సన్నిహితులకు అందించారు. వివాహ సమయం దగ్గర పడుతున్న వేళ మార్చి 1 నుంచి 4 వరకు గుజరాత్ జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రీన్స్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్ అంబానీ కుటుంబం ప్లాన్ చేసింది.

జామ్‌నగర్ పట్ల తమకున్న అభిమానాన్ని, ఆ స్థలంతో తమకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఆహ్వానం కొనసాగింది. 1997లో జామ్‌నగర్ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాస్‌రూట్ రిఫైనింగ్ కాంప్లెక్స్‌ను రిలయన్స్ నిర్మించింది. ఈ క్రమంలోనే కంపెనీ దాదాపు కోటి చెట్లను ఆ ప్రాంతంలో నాటింది. ప్రస్తుతం అక్కడ ఆసియాలోనే అతిపెద్ద మామిడి తోటలు ఉన్నాయి.
ఈ చొరవను మరింత ముందుకు తీసుకెళ్లడంలో అనంత్ కూడా ఎలా ముఖ్యమైన పాత్ర పోషించాడో, అతని ప్రేమ, నమ్మకంతో కాంప్లెక్స్‌ను రక్షించిన వెయ్యికి పైగా జంతువులను సంరక్షణ, కరుణకు స్వర్గధామంగా ఎలా తీర్చిదిద్దాడో ఇన్విటీషన్లో వెల్లడించబడింది.
గత 25 సంవత్సరాలుగా తాము జామ్‌నగర్‌లో మధురమైన జ్ఞాపకాలను నిర్మించుకున్నామని, ఇది తమ హృదయానికి అత్యంత సన్నిహిత ప్రదేశంగా అంబానీ పేర్కొన్నారు. మేము రాధిక మరియు అనంత్‌ల వివాహ వేడుకల ప్రారంభాన్ని జరుపుకుంటున్నప్పుడు మీరు మాతో ఉండాలని మేము ఎదురుచూస్తున్నాము! దయచేసి డేట్ సేవ్ చేసుకోండంటూ అందులో వెల్లడించారు.


Click it and Unblock the Notifications